
ముంబై : శ్రీదేవి పార్థీవ దేహం ఎట్టకేలకు ముంబై ఛత్రపతి విమానాశ్రయం నుంచి ఆమె ఇంటికి చేరుకుంది. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె భౌతికకాయాన్ని ముంబైకి తీసుకొచ్చారు. మృతదేహం వెంట బొనీ కపూర్, ఖుషీ కపూర్‌లు ఉన్నారు. ముందస్తు జాగ్రత్తగా శ్రీదేవి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బుధవారం 9 గంటలకు గ్రీన్ ఎకర్స్ నుంచి కంట్రీ క్లబ్‌కు శ్రీదేవి పార్థీవదేహన్ని తరలించనున్నారు. ఉదయం తొమ్మిదన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకూ శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనకు అనుమతిస్తారు. మధ్యాహ్నం పన్నెడున్నర నుంచి ఒంటి గంట వరకు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. అనంతరం రెండు గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం అవుంతుంది. మధ్యాహ్నం మూడున్నరకు విలే పార్లే హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.