రానా చాలా ఇబ్బంది పెట్టాడు : శ్రీ దివ్య | sri divya on her working experience with rana | Sakshi
Sakshi News home page

రానా చాలా ఇబ్బంది పెట్టాడు : శ్రీ దివ్య

Feb 7 2016 1:16 PM | Updated on Aug 11 2019 12:52 PM

రానా చాలా ఇబ్బంది పెట్టాడు : శ్రీ దివ్య - Sakshi

రానా చాలా ఇబ్బంది పెట్టాడు : శ్రీ దివ్య

షూటింగ్ సమయంలో రానా తనను తెగ ఇబ్బంది పెట్టాడని చెప్పింది హీరోయిన్ శ్రీదివ్య..

ప్రస్తుతం బెంగళూరు నాట్కల్ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న శ్రీదివ్య, సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సమంత, ఆర్య, బాబీ సింహా, లక్ష్మీరాయ్లు నటిస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. తమిళనాట ఈ శుక్రవారం రిలీజ్ అయిన బెంగళూర్ నాట్కల్ డిసెంట్ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీదివ్య, షూటింగ్ సమయంలో రానా తనను తెగ ఇబ్బంది పెట్టాడని చెప్పింది.

అయితే రానా, శ్రీదివ్యను ఇబ్బంది పెట్టింది వ్యక్తిగతంగా కాదులేండి. రానా, శ్రీదివ్యలు ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి హైట్ మ్యాచ్ కాకపోవటంతో షూటింగ్ సమయంలో నానా తంటాలు పడాల్సి వచ్చిందట. కార్ సీట్ నుంచి ప్రతీ విషయంలో శ్రీదివ్యను హైట్గా చూపించటం కోసం తెగ కష్టపడాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని సరదాగా మీడియాతో షేర్ చేసుకుంది శ్రీదివ్య.

Advertisement
 
Advertisement
Advertisement