సన్నీ వెబ్‌

Special to sunnu leone Karenjit Kaur - Sakshi

ఎంటర్‌టైన్‌మెంట్‌ చాలా సీరియస్‌ బిజినెస్‌. ఎంత కమర్షియల్‌గా ఉంటే.. అంత కలెక్షన్‌ ఉంటుంది! పెద్దలు సెలివిచ్చినట్లు... ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రాస్టిట్యూషన్‌ అయితే ప్రాస్టిట్యూషన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎందుకు కాకూడదు?! మాటల కూర్పు బాగుంది కాబట్టిపదిమంది చెప్పుకుంటారు కాబట్టిపెద్దలు అలా సెలవిచ్చి ఉండొచ్చు.కానీ పిల్లల మీద ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. 

‘‘ఈ దేశంలోని  స్త్రీలు మిమ్మల్ని చూసి భయపడతారనుకుంటా.. వాళ్ల భర్తల గురించి?’’ సన్నీ లియోన్‌ను సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ జర్నలిస్ట్‌ భూపేంద్ర దూబే అడిగిన ప్రశ్న. జవాబుగా పెద్దగా నవ్వింది సన్నీలియోన్‌. ‘‘భారతీయ మహిళల పట్ల మీకు ఇంత చిన్న అభిప్రాయం ఉందన్నమాట’’ ఆమె జవాబు. ‘‘ఆమిర్‌ఖాన్‌  మీతో కలిసి నటిస్తాడనుకుంటున్నారా?’’‘‘మీరు నటిస్తున్న అడల్ట్‌ కామెడీస్‌ని  టీవీలో చూడ్డానికి ఇష్టపడను. ఎందుకంటే ఇంట్లో పిల్లలుంటారు కాబట్టి’’ అన్నాడు దూబే.‘‘అలాంటి షోస్‌ చాలా ఎంజాయ్‌ చేస్తాను. ఆ నటీనటులను  ‘‘వావ్‌... వాట్‌ అమేజింగ్‌ యాక్టర్స్‌’’ అని అనుకుంటాను తప్ప వాళ్లు  సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తారు  అని ఆలోచించను’’ అంటూ దూబే ముక్కు పగలగొట్టింది సన్నీ. ‘‘కాలాన్ని వెనక్కి తిప్పితే.. మళ్లీ పోర్న్‌స్టార్‌గానే పనిచేస్తారా? మీ పాస్ట్‌ గురించి ఎలా ఫీలవుతారు?’’ పట్టువదలకుండా ఆమెను కార్నర్‌ చేసే ప్రయత్నం దూబేది. ‘‘నో రిగ్రెట్స్‌ ఎబౌట్‌ మై పాస్ట్‌’’ అంది స్థిరంగా సన్నీ.‘‘అడల్ట్‌ స్టార్‌కి  పోర్న్‌స్టార్‌కి పెద్ద తేడా ఏముంది?’’ అడిగాడు.‘‘గట్స్‌’’ చెప్పింది సన్నీ.దాదాపు రెండున్నరేళ్ల కిందటి ఇంటర్వ్యూ ఇది. సన్నీని ఎంత ఓన్‌ చేసుకున్నారు అంటే తెల్లవారే ఆమిర్‌ఖాన్‌ తన ట్విట్టర్‌లో ‘‘సన్నీతో నేను నటిస్తాను’’ అని ట్వీట్‌ చేసేంత. హఠాత్తుగాఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు?  ఆమె బయోపిక్‌ వస్తోంది కదా!  ‘‘కరెన్‌జిత్‌ కౌర్‌.. ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీలియోన్‌’’ పేరుతో  జీ5 ఇండియా వెబ్‌చానెల్‌లో మొన్న పదిహేనోతేదీ నుంచి (జూలై) ప్రసారమవుతోంది. ఫస్ట్‌ సీజన్‌లో పది ఎపిసోడ్స్‌ ఉంటాయి. 

కథ: ఇప్పటికే  రీడర్స్‌కి, వ్యూయర్స్‌కి సన్నీ జీవితంలోని చాలా విషయాల గురించి తెలుసు. ఎన్నో ఇంటర్వ్యూలలో ఆమె తన ఫ్లాష్‌బ్యాక్‌ షేర్‌ చేసుకుంది. ఇప్పుడు జీ5 ఇండియా .. నెట్టింట్లో మొబైల్‌ఫోన్‌ స్క్రీన్‌ మీద  ప్రతి ఒక్కరూ చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. సన్నీ పంజాబీ అమ్మాయి. కెనడా, అమెరికాలో పెరిగింది. టీన్స్‌లో ఉన్నప్పుడే తండ్రి ఆర్థిక భారాన్ని తలకెత్తుకునే పరిస్థితి వచ్చింది. మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. తను మోడల్‌గా చేసిన ఫస్ట్‌ ప్రాజెక్ట్‌ లోదుస్తులు. ఎలాంటి బెరుకు, భయం లేకుండా కెమెరా ముందు నటించింది. ఆ ఆదాయం.. ఆమెలో ఉన్న చిన్న చిన్న ఆశలను నెరవేర్చుకునే వెసులుబాటునిచ్చింది. స్కూల్లో ఉన్నప్పుడు ఓ ఫ్రాక్‌ మీద ఆమె కన్ను పడుతుంది. దాని విలువ 60 డాలర్లు. కొనుక్కునే స్తోమత లేదు. అంతకన్నా ముందు అలాంటి ఫ్రాక్స్‌ వేసుకునే అనుమతీ ఆ ఇంట్లో లేదు. తన సంపాదనతో అలాంటి కలలను నెరవేర్చుకుంటుంటుంది.  మోడలింగ్‌ చేస్తున్నప్పుడే అడల్ట్‌ మూవీస్‌లో అంతకంటే ఎక్కువ డబ్బుతో ఇబ్బడిముబ్బడి అవకాశాలు ఆమె కాళ్లకు తగులుతుంటాయి. పక్కకు నెడుతూ ముందుకెళ్తుంది. కానీ ఒకానొక సమయంలో ఒప్పుకోవాల్సి వస్తుంది. నటించడం మొదలుపెడుతుంది. అంత సంపాదన కూతురికెలా వస్తోంది అని ఇంట్లో ఎవరూ సందేహించరు. తండ్రికి అడగాలనుంటుంది కాని అడగడు. అడల్ట్‌ మేగజైన్‌ మీద బొమ్మై కనపడుతుంది వాళ్ల అన్నకి. అప్పుడర్థమవుతుంది చెల్లికి డబ్బెక్కడినుంచి వస్తుందో అని. అయినా ఆపడు. అండగా ఉంటాడు. ఇలాంటి నిజాలన్నీ స్క్రీన్‌ మీద ప్లే అవుతాయి. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే కదా:అవును సినిమా మీడియం మెయిన్‌ ఉద్దేశం ఎంటర్‌టైన్‌మెంటే. ఈ సంగతిని చాలా సటిల్‌గా చెప్పాడు మిలన్‌ లూత్రా అనే దర్శకుడు ‘‘డర్టీ పిక్చర్‌’’ ద్వారా. సిల్క్‌స్మిత బయోపిక్‌గా వచ్చిందా చిత్రం. ఎంటర్‌టైన్‌మెంటే లక్ష్యంగా పెట్టుకున్నాడు కాబట్టి స్వేచ్ఛ తీసుకున్నాడు. సిల్క్‌స్మిత లైఫ్‌కి రంగులు అద్దాడు. అంతదాకా ఎందుకు మహానటి విషయంలో కూడా ఇలాంటివి జరిగాయని విమర్శకులు చాలామంది వాపోయారు. సినిమా కదా.. మామూలే అని కొట్టేశారు ప్రేక్షకులు. కానీ అమ్మాయిలు, మారణాయుధాలు, డ్రగ్స్, ఉగ్రవాదులతో స్నేహసంబంధాలు, కోపం, ఆవేశం వంటి లక్షణాలతో బ్యాడ్‌ బాయ్‌ ఇమేజ్‌ను మూటగట్టుకున్న  సంజయ్‌దత్‌ను... ‘సంజు’లో హీరోగా చూపించడాన్నే తప్పుబట్టారు కొందరు. 

కరెన్‌జిత్‌ కౌర్‌ విషయంలోనూ:ఇప్పుడు సన్నీలియోన్‌ బయోపిక్‌ గురించీ ఆ ఆలోచనే చేస్తున్నారు. సినిమాకు ఎంటర్‌టైన్‌మెంటే ప్రాణం. ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే... ప్రేక్షకులను కట్టిపడేయడం. ఆఫ్‌న్యూడ్‌ లేడీస్, వాన పాటలు, లవ్‌ మేకింగ్‌ సీన్స్‌తోనే కాదు. అంతకుమించిన కథాబలం, కథనంతో! సన్నీలియోన్‌ను కరెన్‌జిత్‌ కౌర్‌గా తెలుసుకోవడం కోసం చూడరు. కరెన్‌జిత్‌ కౌర్‌ సన్నీలియోన్‌గా మారడం పట్లే ఉత్సుకత ప్రదర్శిస్తారు.  ఈ చిన్న తేడా పెద్ద ప్రభావాన్నే చూపెడుతుంది. సన్నీలియోన్‌కు తన వృత్తి అనివార్యమే కావచ్చు. సోదరుడు ఆమెను ఎక్స్‌ప్లాయిట్‌ చేశాడు. ఇవన్నిటినీ సెల్‌ఫోన్లోనే చూసే వీలు కల్పిస్తున్న టెక్నాలజీనీ ఆపలేం. డబ్బుకోసం జరుగుతున్న ఈ ప్రయత్నాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టలేం. చేయాల్సిందల్లా ఒకటే.. సంజు అయినా.. డర్టీ పిక్చర్‌ అయినా... కరెన్‌జిత్‌కౌర్‌ అయినా.. సినిమానే. సినిమాలాగనే చూడాలి. ఎంటర్‌టైన్‌ అవ్వాలి. మరిచిపోవాలి. మనీమేకింగ్‌ కోసం వాళ్లకు కనపడిన దారులను మనం ఎంచుకోవద్దు అనే స్పృహతో ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. 

ఎన్ని బయోపిక్‌లు:తెలుగులో నాట్యకళాకారిణి సుధాచంద్రన్‌ లైఫ్‌ను మయూరిగా ఫ్రేమ్‌ చేశాడు సింగీతం శ్రీనివాసరావు. సుధాచంద్రన్‌ జీవితంలో జరిగిన ప్రమాదాన్ని మాత్రమే మూలంగా తీసుకుని ఇతర కథనంతా సినిమాకు అనుగుణంగానే అల్లుకున్నాడు. ఆ తర్వాత ఉషాకిరణ్‌మూవీసే ప్రముఖ క్రీడాకారిణి అశ్వినీ నాచప్ప మీద బయోపిక్‌ తీసింది ‘అశ్విని’గా. ఇదీ అంతే కేవలం క్రీడాకారిణి అనే అంశం మాత్రమే అశ్వినీ నాచప్పకు సంబంధించింది. మిగతా అంతా 24 క్రాఫ్ట్స్‌కు కావల్సిన కల్పితమే. మళ్లీ ఇదే సంస్థ ఓ గిరిజన యువతి చేసిన పోరాటాన్ని ‘‘మౌనపోరాటం’’అనే సినిమాగా మలిచింది. దీనికీ బోలెడంత డ్రామాను జతచేసింది.హిందీ విషయానికి వస్తే.. అగ్రకులస్తుల అహంకారానికి బలై బందిపోటుగా మారిన చంబల్‌ రాణి ఫూలన్‌దేవి జీవితాన్ని సినిమాగా తీశాడు శేఖర్‌కపూర్‌. బ్యాండిట్‌ క్వీన్‌గా బయోస్కోప్‌లో పెద్ద సంచలనమే సృష్టించింది ఇది. సీన్‌కో రేప్‌ను పెట్టి.. చాలా అతి చేశాడు అనే అపవాదునూ మూటగట్టుకున్నాడు శేఖర్‌ కపూర్‌. జుబేదాకు దర్శకత్వం వహించాడు  శ్యామ్‌బెనెగళ్‌. రాజపుత్ర యువరాజు రెండో పెళ్లి చేసుకున్న ఓ ముస్లిం యువతి జీవిత కథ అది.

రాజకుటుంబీకులు ఆమెకు కోడలి స్థానం ఇవ్వరు. ఆ  స్థానం కోసం ఆమె చేసిన పోరే జుబేదా. ఈ అసలులోనూ కాస్తంత సినిమా కల్తీ కలిసిందని చాలా మంది వ్యాసాలు రాశారు. డర్టీ పిక్చర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక పాకిస్తాన్‌కు చిక్కి, అక్కడి జైల్లో మగ్గుతున్న మన సైనికుడి విముక్తి కోసం ఏళ్లకు ఏళ్లు పోరాడిన అతని సోదరి సరబ్‌జిత్‌ మీదా బయోపిక్‌ వచ్చింది. సరబ్‌జిత్‌గా. తర్వాత మేరీకోమ్‌. ఆడవాళ్లకు బాక్సింగ్‌ ఏంటీ అన్న ఎగతాళిని తిప్పికొట్టడానికి పంచ్‌ ప్రాక్టీస్‌ చేస్తుంది. మెడల్స్‌ సాధిస్తుంది మేరీకోమ్‌. ఆ ప్రేరణే మేరీకోమ్‌ మూవీ. హైజాక్‌ అయిన విమానంలోని ప్రయాణికులను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఎయిర్‌ హోస్టెస్‌ నీరజా బానోత్‌ మీదా సినిమా తీశారు.. ‘నిరజా’గా. ఆశించిన విజయం దక్కలేదు. కాని స్ఫూర్తి అందింది. స్క్రీన్‌  స్వేచ్ఛ లేకపోతే సినిమాను పండించడం కష్టం. అలాగని స్వేచ్ఛే పరమావధిగా సాగితే అంతకన్నా నష్టం. బాక్సాఫీస్‌ నిండటమే కాదు.. గౌరవం పెంచడమూ అవసరమే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top