
యోగేశ్ కల్లే, అకృతి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం త్రిముఖ. సన్నీ లియోన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి రాజేశ్ నాయుడు దర్శకత్వం వహించారు. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. డిసెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీని త్వరలోనే రివీల్ చేయనున్నారు. పాన్ ఇండియాలో రేంజ్‌లో హిందీ, తెలుగు భాషల్లో ఓకేసారి తెరకెక్కించారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను చేరువయ్యేలా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో సీఐడీ ఆదిత్య శ్రీవాస్తవ, ప్రవీణ్, షకలక శంకర్, మోట్టా రాజేంద్రన్, ఆషు రెడ్డి, సుమన్, రవి ప్రకాష్, సాహితి, సూర్య, జీవా, జెమిని సురేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు వినోద్ యజమాన్య సంగీతమందిస్తున్నారు.