ప్రేమికురాలు మోసం చేస్తే? | special movie released on june 21 | Sakshi
Sakshi News home page

ప్రేమికురాలు మోసం చేస్తే?

Jun 17 2019 3:03 AM | Updated on Jun 17 2019 3:03 AM

special movie released on june 21 - Sakshi

అక్షిత శ్రీనివాస్‌

‘‘ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తుంది. అందుకు కారణమైన వారిని తెలుసుకొని, వారిని మైండ్‌ రీడర్‌ ఎలా అంతం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘స్పెషల్‌’. విలన్‌గా, సహనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్పెషల్‌’. వాత్సవ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.  వాస్తవ్‌ మాట్లాడుతూ– ‘‘మైండ్‌ రీడర్‌ స్టోరీ ఇది. ఫెంటాస్టిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఉంటుంది. ‘గజిని’ టైప్‌ జోనర్‌ అయిన మా సినిమాలో లవ్, ఎమోషన్స్‌కి ప్రాధాన్యం ఇచ్చాం. ఇది చిన్న సినిమానేకానీ, మీరందరూ చూసిన తర్వాత పెద్ద సినిమాగా భావిస్తారు’’ అన్నారు.  ‘‘చిన్నప్పటి నుంచి థ్రిల్లర్స్‌ అంటే ఇష్టం.  ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో  మార్పువచ్చింది. హీరో, హీరోయిన్స్‌కంటే కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  తప్పకుండా మంచి హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరోయిన్‌ అక్షిత శ్రీనివాస్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement