అంతరిక్షంలో ప్రీమియర్ | Space In Premier | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో ప్రీమియర్

Sep 22 2015 11:39 PM | Updated on Sep 3 2017 9:47 AM

అంతరిక్షంలో ప్రీమియర్

అంతరిక్షంలో ప్రీమియర్

సినిమా రిలీజ్ కాక ముందు ప్రముఖులకు ప్రీమియర్ షోస్ వేయడం సాధారణం.

సినిమా రిలీజ్ కాక ముందు ప్రముఖులకు ప్రీమియర్ షోస్ వేయడం సాధారణం. ఇప్పుడు తొలిసారిగా ఓ చిత్రాన్ని ఏకంగా అంతరిక్షంలోని ‘ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్’లో ప్రదర్శించారు. అదే ‘ద మార్షియన్’. అంగారక గ్రహంపై చిక్కుకున్న వ్యోమగామి చుట్టూ తిరిగే కథాంశంతో మాట్ డామన్ హీరోగా ‘గ్లాడియేటర్’ ఫేమ్ రిడ్లీ స్కాట్ దీన్ని తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న చిత్రం రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్రాన్ని ఇటీవలే చూశా. చాలా బాగుంది’’ అని ఆ స్పేస్‌స్టేషన్ నుంచే స్కోట్ కెల్లీ అనే వ్యోమ గామి ట్వీట్ చేశాడు. మొత్తానికి ఈ ప్రీమియర్ సంచలనమైంది.

Advertisement
 
Advertisement
Advertisement