నమ్మలేనట్టుగా అనిపిస్తోంది! | Sonali Bendre back on sets | Sakshi
Sakshi News home page

నమ్మలేనట్టుగా అనిపిస్తోంది!

Feb 4 2019 5:37 AM | Updated on Feb 4 2019 5:37 AM

Sonali Bendre back on sets - Sakshi

సోనాలీ బింద్రే

క్యాన్సర్‌ వ్యాధి చికిత్స కోసం సోనాలీ బింద్రే లండన్‌లో కొంత కాలం గడిపిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముంబై వచ్చిన సోనాలి మళ్లీ షూటింగ్‌ లొకేషన్‌లో అడుగుపెట్టారు. అయితే ఇది సినిమా షూటింగ్‌ కాదు.. యాడ్‌ షూటింగ్‌ కోసం. చాలా కాలం తర్వాత సెట్లో అడుగుపెడుతుంటే నమ్మలేనట్టుగా అనిపిస్తోంది అని పేర్కొన్నారామె.  ‘‘మళ్లీ పనిలో పడటం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. మరింత బాధ్యతగా, అర్థవంతంగా సెట్లోకి అడుగుపెట్టాను. మళ్లీ కెమెరాను ఎదుర్కోవడం, ఎమోషన్స్‌ను పలికించడం హ్యాపీగా ఉంది’’ అంటూ పేర్కొన్నారు సోనాలి. యాడ్స్‌లో నటిస్తున్న ఆమె మళ్లీ సినిమాల్లోనూ నటిస్తారా? వేచి చూద్దాం.

Advertisement
 
Advertisement
Advertisement