ట్విటర్‌ నుంచి వైదొలగిన హీరోయిన్‌! | Sonakshi Sinha Deactivated Her Twitter Account | Sakshi
Sakshi News home page

ట్విటర్‌ అకౌంట్‌ డియాక్టివేట్‌ చేసిన హీరోయిన్‌!

Jun 20 2020 6:59 PM | Updated on Jun 20 2020 8:14 PM

Sonakshi Sinha Deactivated Her Twitter Account - Sakshi

ముంబై: సోనాక్షి సిన్హా ట్విటర్‌ అకౌంట్‌ ఇకపై కనిపించదు. ఎందుకంటే దబాంగ్‌ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయిన ఈ ముద్దు గుమ్మ నెగిటివిటికి దూరంగా ఉండాలి అనుకుంటుందంట. మనఃశాంతిని కాపాడు​ కోవడానికి, నెగిటివిటికి దూరంగా ఉండటానికి ట్విటర్‌ అకౌంట్‌ను డియాక్టివేట్‌ చేశానని సోనాక్షి తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా శనివారం వెల్లడించింది.

(సల్మాన్‌ఖాన్‌తో సాన్నిహిత్యం పెరిగింది)

‘మీ మనఃశాంతిని కాపాడుకుకోవడానికి మొదట చేయవలసింది నెగిటివిటికీ దూరంగా ఉండటం. ఇది ట్విటర్‌ కంటే ఎక్కువ ఇంకెక్కడ ఉండదు. ఛలో, నేను నా అకౌంట్‌ను డీయాక్టివేట్‌ చేస్తున్నాను’ అని సోనాక్షి పోస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌కు కామెంట్‌ సెక్షన్‌ను కూడా సోనాక్షి డిసేబుల్‌ చేసింది. ఇప్పటి వరకు సోనాక్షి 1320 పోస్టులను చేశారు. ఆమెకు 18.5 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య నేపథ్యంలో స్టార్‌ కిడ్స్‌ని అన్‌ ఫాలో చేస్తూ, ట్రోల్‌ చేస్తున్న ఈ తరుణంలో సోనాక్షి ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. (ఐ వాన్న అన్‌ఫాలో యు)

Advertisement
 
Advertisement
Advertisement