అందం కోసం...సిమెంట్ రాసుకుంటా! | Sofia Vergara would use cement to stop ageing | Sakshi
Sakshi News home page

అందం కోసం...సిమెంట్ రాసుకుంటా!

Dec 28 2014 10:59 PM | Updated on Sep 2 2017 6:53 PM

అందం కోసం...సిమెంట్ రాసుకుంటా!

అందం కోసం...సిమెంట్ రాసుకుంటా!

వృద్ధాప్యం గురించి హాలీవుడ్ హాట్ లేడీ సోఫియా వెర్గరా చేస్తున్న వ్యాఖ్యలు హాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

వృద్ధాప్యం గురించి హాలీవుడ్ హాట్ లేడీ సోఫియా వెర్గరా చేస్తున్న వ్యాఖ్యలు హాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వయసు మీద పడే కొద్దీ ఒంటి మీద ముడతలు పడతాయి కదా... అవి పోవడానికి శస్త్ర చికిత్స చేయించుకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చారు సోఫియా వెర్గరా. ఇప్పుడేమో ‘ఒకవేళ నా కంటి కింద ముడతలు వచ్చాయనుకోండి... సిమెంట్ రాసుకుంటే అవి మాయమయ్యే అవకాశం ఉందంటే, నేను రెడీ!’ అంటున్నారు. అది మాత్రమే కాదు అందం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని కూడా  అన్నారు.  ‘‘నా వయసు నాలుగు పదులు. కానీ, రెండు పదుల్లోనే ఉన్నానన్నది నా ఫీలింగ్’’ అని పేర్కొన్నారు. మొత్తానికి అందమంటే ఈ హాలీవుడ్ భామకు ఎంత పట్టింపో అర్థమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement