భారతీయుడికి బ్రేక్‌? | small break on kamal haasan bharateeyudu 2 | Sakshi
Sakshi News home page

భారతీయుడికి బ్రేక్‌?

May 12 2019 1:50 AM | Updated on Aug 8 2019 11:13 AM

small break on kamal haasan bharateeyudu 2 - Sakshi

కమల్‌హాసన్‌

ప్రస్తుతం కమల్‌హాసన్‌ చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్స్‌ కూడా సీక్వెల్సే. ఒకటేమో ‘భారతీయుడు’ సీక్వెల్‌ ‘భారతీయుడు 2’ కాగా, మరోటి ‘దేవర్‌మగన్‌’ (తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’) సీక్వెల్‌ ‘దేవర్‌మగన్‌ 2’. ఎన్నికల హడావిడి కారణంగా ‘భారతీయుడు’ సినిమాకి తాత్కాలిక బ్రేక్‌ ఇచ్చారు కమల్‌. అయితే లేటెస్ట్‌గా ‘భారతీయుడిని అంతే బ్రేక్‌లో ఉంచి ‘దేవర్‌ మగన్‌ 2’ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో కమల్‌ ఉన్నారని తెలిసింది. ఒకటే షెడ్యూల్‌లో సినిమా మొత్తం కంప్లీట్‌ చేయనున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత సినిమాల్లో కనిపించను అని కమల్‌ స్పష్టం చేశారు. మరి ‘భారతీయుడు 2’కు స్మాల్‌ బ్రేకా? లేకపోతే సినిమా పూర్తిగా ఆగిపోయిందా? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement