మహేష్కు విలన్గా సూర్య..? | Sj surya to play mahesh babus villain in murugadoss film | Sakshi
Sakshi News home page

మహేష్కు విలన్గా సూర్య..?

Mar 22 2016 12:51 PM | Updated on Sep 3 2017 8:20 PM

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు. నెక్ట్స్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు.. తన నెక్ట్స్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నట్టుగా ప్రకటించాడు మహేష్. ఇప్పుడు ఆ సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్లను సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరుకల్లా సెట్స్ మీదకు వెళ్లనుంది.

తెలుగు, తమిళ్తో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్యను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే పలుచిత్రాల్లో హీరోగా నటించిన సూర్య, ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఇరైవిలో విలన్గా చేస్తున్నాడు. అదేబాటలో మహేష్ సినిమాకు సూర్యను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్కు జోడీ కోసం కూడా భారీ కసరత్తు చేస్తున్నారు. తమిళనటి సాయి పల్లవి, కీర్తి సురేష్లతో పాటు, బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పేరు కూడా పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement