యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

sivalingapuram trailer launch - Sakshi

తమిళ, మలయాళ భాషల్లో యాక్షన్‌ హీరోగా చేసిన ఆర్‌.కె.సురేశ్‌ ‘శివలింగాపురం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తోట కృష్ణ దర్శకత్వంలో రావూరి అల్లికేశ్వరి సమర్పణలో రావూరి వెంకటస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు. మధుబాల కథానాయిక. ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ –‘‘అభిరుచితో ఆయన తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అన్నారు.  ‘‘గతంలో లిటిల్‌ హార్ట్స్, మా తల్లి గంగమ్మ, కొక్కొరోకో’ వంటి సినిమాలు తీశాను.

మేము పెరిగిన లొకేషన్‌లో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు వెంకటస్వామి. ‘‘గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని మలిచాను. అన్న, చెల్లెలి సెంటిమెంట్‌ హైలైట్‌ అవుతుంది’’అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టి.ప్రసన్నకుమార్, మోహన్‌ వడ్లపట్ల, సాయివెంకట్, రాకేష్‌ రెడ్డి, పద్మిని నాగులపల్లి, డి.ఎస్‌.రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top