శివతాండవం హైలైట్‌ | Sivalingapuram Movie Trailer | Sakshi
Sakshi News home page

శివతాండవం హైలైట్‌

May 10 2019 3:29 AM | Updated on May 10 2019 3:29 AM

Sivalingapuram Movie Trailer - Sakshi

‘‘కొక్కొరొకో, మా తల్లి గంగమ్మ, లిటిల్‌ హార్ట్స్‌’ వంటి చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు రావూరి వెంకటస్వామి. తాజాగా ఆయన నిర్మించిన చిత్రం ‘శివలింగాపురం’. ఆర్‌.కె. సురేష్, మధుబాల జంటగా, శివుడిగా డాక్టర్‌ భూమారెడ్డి, పార్వతిగా మేఘనా శ్రీలక్ష్మి నటించారు. తోట కృష్ణ దర్శకత్వంలో రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకటస్వామి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా తోట కృష్ణ మాట్లాడుతూ– ‘‘శివలింగాపురంలో జరిగిన కొన్ని సంఘటనలతో ఈ చిత్రకథ సాగుతుంది.  ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. శివశంకర్‌ మాస్టర్‌ చేసిన శివతాండవం నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘కథ నచ్చి ఈ సినిమా నిర్మించా. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో 35 రోజుల పాటు జరిపిన షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తయింది.  డబ్బింగ్‌ పనులు పూర్తి చేసుకుని, ప్రస్తుతం రీరికార్డింగ్, గ్రాఫిక్స్‌ పనులు జరుగుతున్నాయి. జూన్‌లో విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రఫి, సంగీతం: ఘనశ్యామ్‌.

Advertisement
 
Advertisement
Advertisement