సమంత తొలిసారిగా.. | Sivakarthikeyan, Samantha Teams-Up First Time | Sakshi
Sakshi News home page

సమంత తొలిసారిగా..

Jun 16 2017 6:47 PM | Updated on Sep 5 2017 1:47 PM

సమంత తొలిసారిగా..

సమంత తొలిసారిగా..

శివకార్తికేయన్, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి శుక్రవారం పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు

శివకార్తికేయన్, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి శుక్రవారం పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వేలైక్కారన్‌ చిత్రంలో నటిస్తున్న శివకార్తికేయన్‌ ఆ చిత్ర షూటింగ్‌ను దాదాపు పూర్తి చేశారు. ఆ చిత్ర నిర్మాత ఆర్‌డీ.రాజానే తాజా చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అయ్యారు.

ఇంతకుముందు శివకార్తికేయన్‌తో వరుత్తపడాద వాలిబర్‌ సంఘం, రజనీమురుగన్‌ వంటి సూపర్‌ సక్సెస్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పొన్‌రామ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. ఇందులో తొలిసారిగా నటి సమంత శివకార్తికేయన్‌తో జత కట్టనున్నారు. మరో కీలక పాత్రలో సిమ్రాన్‌ నటించనుండడం విశేషం. ఆమె అక్టోబర్‌లో పెళ్లి చేసుకోబోతుండడంతో ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలన్న సమంత కోరిక మేరకు నేటి నుంచి తొలి షెడ్యూల్‌ను 30 రోజులపాటు ఏకధాటిగా నిర్వహించనున్నారట. చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన ఇప్పటికే మూడు పాటలను రెడీ చేశారట. దీనికి బాలసుబ్రమణియన్‌ ఛాయాగ్రహణం నెరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement