మళ్లీ థ్రిల్లర్‌ | Sakshi
Sakshi News home page

మళ్లీ థ్రిల్లర్‌

Published Fri, Sep 21 2018 3:38 AM

Sivakarthikeyan to next team up with 'Irumbu Thirai' fame PS Mithran - Sakshi

‘ఇరుంబుదురై’ దర్శకుడిగా ఫస్ట్‌ సక్సెస్‌ అందుకున్నారు మిత్రన్‌. ఈ సినిమా తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో రిలీజై, మంచి హిట్‌ సాధించింది. ఇప్పుడీ దర్శకుడు తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ శివ కార్తికేయన్‌తో ఉంటుందని అనౌన్స్‌ చేశారు. ఈ విషయం గురించి మిత్రన్‌ మాట్లాడుతూ – ‘‘శివ కార్తికేయన్, నేను కలసి షార్ట్‌ ఫిల్మ్స్‌కి వర్క్‌ చేశాం. తన కోసం ఒక కథ ఎప్పుడో  రాసుకున్నాను.

‘ఇరుంబుదురై’ కంటే ముందే మేం ఓ సినిమా చేయాలి. కానీ  ఇప్పుడు కుదిరింది. ‘ఇరుంబుదురై’లానే ఈ సినిమా కూడా ఫుల్‌ స్పీడ్‌గా సాగే థ్రిల్లర్‌లా ఉండబోతోంది’’ అని పేర్కొన్నారు. శివకార్తికేయన్‌ ప్రస్తుతం రాజేశ్‌తో ఓ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం, రవి కుమార్‌తో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్‌ తర్వాత ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Advertisement
Advertisement