టాలీవుడ్‌ను టార్గెట్‌ చేసిన శివకార్తికేయన్‌ | Siva Karthikeyan Target To Tollywood | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ను టార్గెట్‌ చేసిన శివకార్తికేయన్‌

Jun 29 2018 8:07 AM | Updated on Jun 29 2018 8:07 AM

Siva Karthikeyan Target To Tollywood - Sakshi

తమిళసినిమా: దక్షిణాది సినిమా హద్దులు చెరిపేసుకుంటోంది. హీరోహీరోయిన్లు దాన్ని క్యాష్‌ చేసుకోవాలని ఆశ పడుతున్నారు. కోలీవుడ్‌ స్టార్‌ హీరోలకు దక్షిణాది చిత్ర సీమలో మంచి మార్కెట్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు యువ హీరోలు తమ స్పాన్‌ను   పెంచుకోవాలని ఆరాట పడుతున్నారు. యువ నటుడు శివకార్తికేయన్‌కు అలాంటి ఆశ పట్టింది. ఈయన నటించిన రెమో చిత్రం తెలుగులో అనువాదమై మంచి పేరునే తెచ్చుకుంది. తాజాగా నటిస్తున్న చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ప్లాన్‌ చేస్తున్నారు. శివకార్తికేయన్‌ ప్రస్తుతం పొన్‌రామ్‌ దర్శకత్వంలో నటిస్తున్న సీమరాజా చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఇందులో నటి సమంత నాయకి. ప్రస్తుతం రాజేశ్‌.ఎం దర్శకత్వంలో స్టూడియోగ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.

తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. ఇండ్రు నేట్రు నాళై చిత్రం ఫేమ్‌ ఆర్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించనున్నారు. దీన్ని ఇంతకు ముందు ఆయన హీరోగా రెమో, వేలైక్కారన్, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న సీమరాజా చిత్రాల నిర్మాణ సంస్థ 24 ఏఎం.స్టూడియోస్‌ పతాకంపై ఆర్‌డీ.రాజానే నిర్మించనుండడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా క్రేజీ నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించనుంది. ఈ చిత్రానికి ఆమెకు కోటిన్నర పారితోషికం చెల్లిస్తున్నట్లు సమాచారం. తెలుగులో శివకార్తికేయన్‌ మార్కెట్‌ను పెంచుకోవాలన్న దృష్టితోనే ఈ అమ్మడిని కథానాయకిగా ఎంపిక చేసినట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. నటి భానుప్రియ కూడా కీలక పాత్రను పోషించనున్నారు. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో యోగిబాబు, కరుణాకరన్, కోదండం  నటించనున్నారు. దీనికి సంగీత మాత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ బాణీలు కడుతున్నారు. శివకార్తికేయన్‌ చి త్రానికి ఈయన సంగీతాన్ని అందించడం ఇదే ప్రప్రథమం. సైన్స్‌ ఫిక్సన్‌ కథాం శంతో రూపొందనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement