సిరివెన్నెల

siri vennela as priyamani - Sakshi

తెలుగు తెరపై ప్రియమణి కనిపించి రెండేళ్లయింది. ‘మన ఊరి రామాయణం’ తర్వాత ఆమె వేరే ఏ తెలుగు చిత్రంలో నటించలేదు. గతేడాది ముస్తఫా రాజ్‌ని పెళ్లాడిన ప్రియమణి కెరీర్‌పై కూడా బాగానే ఫోకస్‌ చేస్తున్నారు. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తున్న ఆమె ఇప్పుడు ‘సిరివెన్నెల’ అనే తెలుగు చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రకాష్‌ పులిజాల దర్శకత్వంలో ఏఎన్‌బి కోఆర్డినేటర్స్‌ బ్యానర్‌పై ఏఎన్‌ బాషా, రామసీత ఈ సినిమా నిర్మించనున్నారు.

తెలుగు చిత్రసీమలో క్లాసిక్‌ మూవీగా చెప్పుకునే ‘సిరివెన్నెల’ సినిమా టైటిల్‌ని  ప్రియమణి సినిమాకి పెట్టడం విశేషం. ఈ చిత్రకథ బాగా నచ్చడంతో పాటు నటనకి ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో ప్రియమణి మా సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారని దర్శక–నిర్మాతలు చెప్పారు. సాయి తేజస్విని, ‘బాహుబలి’ ప్రభాకర్, సీనియర్‌ నటుడు అజయ్‌ రత్నం, ‘రాకెట్‌’ రాఘవ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top