హీరోగా మారనున్న ప్రముఖ సింగర్ | Singer Adnan sami make acting in the movies | Sakshi
Sakshi News home page

హీరోగా మారనున్న ప్రముఖ సింగర్

Jun 28 2017 5:27 PM | Updated on Mar 28 2019 6:10 PM

హీరోగా మారనున్న ప్రముఖ సింగర్ - Sakshi

హీరోగా మారనున్న ప్రముఖ సింగర్

ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ నటుడిగా మారనున్నారు.

ముంబై: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ నటుడిగా మారనున్నారు. రాధికారావు, వినయ్ సప్రే దర్శకత్వంలో త్వరలో రూపుదదిద్దుకోనున్న‘అఫ్ఘాన్‌ ఇన్ సెర్చ్ ఆఫ్ ఏ హోమ్‌’ సినిమాలో ఆయన నటించనున్నారు. వీరిద్దరి దర్శకత్వంలో పనిచేయటం చాలా సంతోషంగా ఉందని సమీ పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా వీరిద్దరితో స్నేహబంధం కొనసాగుతోందని తెలిపారు.

ఈ సినిమాలో ఆయన అఫ్ఘానిస్తాన్‌లో పుట్టి పెరిగిన కళాకారుడిగా కనిపించనున్నారు. అనుకోని పరిస్థితుల్లో దేశం వదిలి వెళ్లిన ఆయన మరో దేశంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు ? అనేదే కథాంశం. భారత పౌరసత్వం లభించిన తర్వాత ఆయన చేపట్టిన మొదటి ప్రాజెక్టు ఇదే. బ్రిటన్‌లో  పుట్టి పెరిగిన  అద్నాన్‌కు ఏడాది క్రితం భారత పౌరసత్వం లభించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement