రూ.63 కోట్లతో ఇల్లు కొనుక్కుంది | Singer Adele buys $9.5 mn mansion in Beverly Hills | Sakshi
Sakshi News home page

రూ.63 కోట్లతో ఇల్లు కొనుక్కుంది

May 31 2016 11:43 AM | Updated on Sep 4 2017 1:21 AM

రూ.63 కోట్లతో ఇల్లు కొనుక్కుంది

రూ.63 కోట్లతో ఇల్లు కొనుక్కుంది

హాలీవుడ్ లో ఇళ్ల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.

లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ లో ఇళ్ల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. నిన్నకాక మొన్న పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ దాదాపు 1800 కోట్ల రూపాయలు పెట్టి విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసింది. తాజాగా పాప్ సింగర్ అడిలె కూడా లగ్జరీ సౌధాన్ని సొంతం చేసుకుంది. లాస్ ఏంజెలెస్ లోని బెవెర్లీ హిల్స్ గేగెట్ కమ్యూనిటీలో ఉన్న భవంతిని సుమారు రూ.63 కోట్లు (9.5 మిలియన్ డాలర్లు) పెట్టి కొనుక్కుంది.

6,600 చదరపు విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంటిలో నాలుగు బెడ్రూములు, ఆరు బాత్రూములు, స్విమ్మింగ్ పూల్ ఉంది. త్వరలోనే కొత్త ఇంట్లోకి మారాలని అడిలె భావిస్తోంది. ఆమెకు జెన్నిఫర్ లారెన్స్, అస్టన్ కుచర్, మిలా కునిస్, కెమెరాన్ డియాజ్ వంటి సెలబ్రిటీలో ఇరుగుపొరుగుగా ఉన్నారు. మరోవైపు సింగర్ పింక్, కేరె హర్ట్ దంపతులు కాలిఫోర్నియాలోని తమ విలాసవంతమైన భవనాన్ని సుమారు రూ. 86 కోట్లకు అమ్మకానికి పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement