సైంటిస్ట్‌తో జోడీ

Simran on board Madhavan's Nambi Narayanan biopic - Sakshi

సినిమాల ఎంపికలో కథానాయిక సిమ్రాన్‌ స్పీడ్‌ పెంచినట్లు తెలుస్తోంది. గతేడాది ‘సీమరాజా’ అనే తమిళ సినిమాలో విలన్‌గా నటించారామె. ఈ ఏడాది రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘పేట’ చిత్రంలో ఒక కథానాయికగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పుడు ఆమె మాధవన్‌ సరసన నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాధవన్‌ హీరోగా నటిస్తున్నారు. అనంత్‌ మహాదేవన్, ఆర్‌. మాధవన్‌ దర్శకులు. ఈ సినిమాలో సిమ్రాన్‌ కథానాయికగా నటించబోతున్నారని తాజా కోలీవుడ్‌ టాక్‌. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా సమ్మర్‌లో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top