సిద్ధార్థ ప్రేమకథ! | Siddhartha love story | Sakshi
Sakshi News home page

సిద్ధార్థ ప్రేమకథ!

Aug 9 2015 10:40 PM | Updated on Sep 3 2017 7:07 AM

సిద్ధార్థ ప్రేమకథ!

సిద్ధార్థ ప్రేమకథ!

జీనియస్’, ‘రామ్‌లీలా’ చిత్రాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దాసరి కిరణ్‌కుమార్ రామదూత క్రియేషన్స్ పై నిర్మిస్తున్న

 ‘జీనియస్’, ‘రామ్‌లీలా’ చిత్రాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దాసరి కిరణ్‌కుమార్ రామదూత క్రియేషన్స్ పై నిర్మిస్తున్న మూడో చిత్రం ‘సిద్ధార్థ’. సాగర్ (ఆర్.కె. నాయుడు), రాగిణీ నంద్వానీ జంటగా లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో ఈ చిత్రం రూపొందు తోంది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌లో పదేళ్లు పని చేసిన దయానంద్ రెడ్డి  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 22 రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ మలేసియాలో జరిగింది. ఈ నెలలో హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో ఈ సినిమా పూర్తవుతుంది.
 
  దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ- ‘‘మలేసియాలోని కౌలాలంపూర్, మలాకాలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. రెండు పాటలు, టాకీ, ఫైట్స్ షూట్ చేశాం. ఇది లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్. సాగర్ పాత్ర చాలా బాగుంటుంది. ఫైట్స్, డ్యాన్స్.. ఇలా అన్నీ బాగా చేస్తున్నాడు. సాగర్, రాగిణిల కెమిస్ట్రీ ఓ హైలైట్‌గా నిలుస్తుంది’’అని చెప్పారు. ఈ చిత్రానికి కథ: విసు, రచనా సహకారం: రవిరెడ్డి మల్లు, మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: మణిశర్మ, కెమెరా: ఎస్. గోపాల్ రెడ్డి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఫైట్స్: సాల్మన్ రాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముత్యాల రమేశ్.
 

Advertisement
 
Advertisement
Advertisement