శ్రుతీ కొత్త రాగం | Shruti Hassan focus on Music Career | Sakshi
Sakshi News home page

శ్రుతీ కొత్త రాగం

Oct 7 2018 5:18 AM | Updated on Oct 7 2018 5:18 AM

Shruti Hassan focus on Music Career - Sakshi

శ్రుతీహాసన్‌

కేవలం హీరోయిన్‌గానే కాదు.. సింగర్‌గా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కూడా శ్రుతీహాసన్‌ పేరు సంపాదించుకున్నారు. కానీ ఇటీవల సినిమాలను కాస్త తగ్గించి మ్యూజిక్‌ కెరీర్‌పై దృష్టి పెట్టినట్లు ఉన్నారు. అందుకే మ్యూజిక్‌ ఇన్‌స్ట్రూమెంట్స్‌తో ఆమె ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పుడు శ్రుతీహాసన్‌ పాడిన పాట ఒకటి నవంబర్‌లో బయటకు రానుంది. ఈ పాటకు లిరిక్స్‌ కూడా ఆమెనే రాశారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌ నూక్లియాతో ఆమె కలిసి పని చేశారు. ‘‘నూక్లియాతో కలిసి వర్క్‌ చేయడం సంతోషంగా ఉంది. ఫన్‌గా ఉండే ట్రాక్‌ కోసం ట్రై చేశాం. ఇలాంటి కొత్త జానర్స్‌ పట్ల ఒక ఆర్టిస్టుగా నేనెప్పుడూ ఆసక్తిగానే ఉంటాను.

ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ వరల్డ్‌లో నేను ట్రావెల్‌ కావడానికి నూక్లియాలాంటి మంచి వ్యక్తి సహాయం చాలా అవసరం’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్‌. ప్రస్తుతం మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ హిందీ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారామె. ఇందులో విద్యుత్‌ జమాల్‌ హీరోగా నటిస్తున్నారు. అన్నట్లు.. శ్రుతీహాసన్‌ పాటలు పాడటం ఇది కొత్త కాదు. ఇప్పుడు కొత్త పాట పాడారంతే. ఓసారి వెనక్కి వెళితే ‘రేసు గుర్రం’లో ‘డౌన్‌ డౌన్‌ డుప్పా డుప్పా..’, ‘ఆగడు’లో ‘జంక్షన్‌లో...’ ఇలా చాలా పాటలు పాడారు. ఆ మాటకొస్తే.. చిన్నప్పుడే ‘హేరామ్‌’లో తండ్రి కమల్‌హాసన్‌తో కలసి ‘రామ్‌ రామ్‌’ పాట పాడారామె.

Advertisement
 
Advertisement
Advertisement