శ్రుతి కుదిరిందా? | Shruti Haasan In Chiranjeevi Koratala Siva Movie? | Sakshi
Sakshi News home page

శ్రుతి కుదిరిందా?

Mar 10 2019 5:23 AM | Updated on Mar 10 2019 5:23 AM

Shruti Haasan In Chiranjeevi Koratala Siva Movie? - Sakshi

శ్రుతీహాసన్‌

‘సైరా’ తర్వాత చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సామాజిక సందేశంతో కూడిన కథగా ఈ చిత్రం రూపొందనుందని టాక్‌. చిరంజీవి ‘సైరా’తో బిజీగా గడుపుతున్నారు. మరోవైపు చిరంజీవితో చేయబోయే చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో దర్శకుడు కొరటాల శివ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలు పేర్లు వినిపించాయి. లేటెస్ట్‌గా శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా బావుంటుందని చిత్రబృందం భావిస్తున్నారట.

ఆల్రెడీ ఈ సినిమాలో హీరోయిన్లుగా అనుష్క, నయనతార, తమన్నా పేర్లు వినిపించాయి. తాజాగా శ్రుతీ పేరు పరిశీలనలోకి వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమాలో శ్రుతీ హీరోయిన్‌గా ఇదివరకే యాక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. మరి చిరంజీవితో కొరటాల చేయబోయే చిత్రంలో శ్రుతి నటిస్తారా? ఆ విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 2020లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement