మహేష్ను మించిపోయిన శృతి | Shruthi Hassan Beats Mahesh babu and trisha | Sakshi
Sakshi News home page

మహేష్ను మించిపోయిన శృతి

Oct 1 2015 11:32 AM | Updated on Sep 3 2017 10:18 AM

మహేష్ను మించిపోయిన శృతి

మహేష్ను మించిపోయిన శృతి

స్టార్ వారసురాలిగా వెండితెర మీదకు అడుగుపెట్టిన శృతిహాసన్.. అన్ని రంగాల్లో హవా చూపిస్తుంది. కెరీర్ స్టార్టింగ్లో కాస్త తడబడినా, సక్సెస్ ట్రాక్ ఎక్కిన తరువాత మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. సౌత్తో పాటు నార్త్...

స్టార్ వారసురాలిగా వెండితెర మీదకు అడుగుపెట్టిన శృతిహాసన్.. అన్ని రంగాల్లో హవా చూపిస్తుంది. కెరీర్ స్టార్టింగ్లో కాస్త తడబడినా, సక్సెస్ ట్రాక్  ఎక్కిన తరువాత మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. సౌత్తో పాటు నార్త్ లోనూ స్టార్ స్టేటస్ కోసం పోటీ పడుతోంది. ఇప్పటికే సూపర్ హిట్స్తో ఫుల్ ఫాంలో ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో కూడా అదే జోరు చూపిస్తోంది.

సౌత్ ఇండియాలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు క్రేజ్ కాస్త తక్కువ. అయితే ఈ ఫార్ములాను బ్రేక్ చేసింది శృతి హాసన్. రెమ్యూనరేషన్, కలెక్షన్ల పరంగా కాకపోయిన తన గ్లామర్తో సోషల్ మీడియాలో హవా చూపిస్తుంది. ట్విట్టర్ ఫాలోవర్స్లో టాప్ హీరోలకు కూడా షాక్ ఇస్తుంది. ట్విట్టర్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్కు 15లక్షల ఫాలోవర్స్ ఉండగా శృతి అంతకు డబుల్ ఫాలోవర్స్ ను సాధిచింది. 30 లక్షల మంది ఫాలోవర్స్ తో టాప్ ప్లేస్ కు చేరింది. ఇక ఎప్పటి నుంచో ట్విట్టర్లో యాక్టివ్ గా ఉంటున్న సౌత్ బ్యూటీ త్రిషకు కూడా షాక్ ఇచ్చింది శృతి.

ప్రస్తుతం పులి సినిమాతో సౌత్లో సందడి చేస్తున్న శృతిహాసన్ అజిత్ సరసన వేదలం సినిమాలోనటిస్తుంది. హిందీలోనూ రెండు సినిమాలలో నటిస్తున్న శృతి హాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement