మిసెస్‌ అవుతారా? | Shraddha Kapoor-Rohan Shrestha wedding reports | Sakshi
Sakshi News home page

మిసెస్‌ అవుతారా?

Mar 23 2019 2:29 AM | Updated on Mar 23 2019 2:29 AM

Shraddha Kapoor-Rohan Shrestha wedding reports - Sakshi

శ్రద్ధాకపూర్‌

ప్రస్తుతం మిస్‌గా ఉన్న బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌ 2020లో మిసెస్‌గా మారనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఆమె ఏడడుగులు వేసే ఆలోచనలో ఉన్నారని ముంబై సమాచారం. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు 33 ఏళ్ల శ్రద్ధాకపూర్‌. పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన సమయం అని కుటుంబ సభ్యులు భావించడంతో శ్రద్ధ కూడా వాళ్ల అభిప్రాయంతో ఏకీభవించారట.

కొంతకాలంగా ఫొటోగ్రాఫర్‌ రోహన్‌ శ్రేష్ఠతో ఆమె డేటింగ్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె పబ్లిక్‌గా అంగీకరించకపోయినా ప్రేమలో ఉన్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌ అని బాలీవుడ్‌ టాక్‌. ఇప్పుడు ఈ ప్రేమను పెళ్లి వరకూ తీసుకువెళ్లాలని, 2020లో పెళ్లి చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారట. బాలీవుడ్‌లో హీరోయిన్ల షాదీ పరంపరలో శ్రద్ధాకపూర్‌ కూడా జాయిన్‌ అవ్వనున్నారు. మరి మిసెస్‌ అయ్యాక సినిమాలను మిస్‌ అవుతారా? ఊరుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement