కల నిజమాయె | Shraddha Das is an Interpol officer in Kotigobba 3 | Sakshi
Sakshi News home page

కల నిజమాయె

Jun 17 2018 12:07 AM | Updated on Aug 21 2018 6:22 PM

Shraddha Das is an Interpol officer in Kotigobba 3 - Sakshi

శ్రద్ధాదాస్‌

ఇండస్ట్రీలోకి కాలు పెట్టిన యాక్టర్స్‌ అందరికీ ఏదో ఒక డ్రీమ్‌ రోల్‌ ఉంటుంది.  అలాగే కథానాయికగా శ్రద్ధాదాస్‌ కూడా పోలీస్‌ క్యారెక్టర్‌ను డ్రీమ్‌ రోల్‌గా భావించారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పదేళ్ల తర్వాత ఆమె అనుకున్న డ్రీమ్‌ రోల్‌లో నటించే అవకాశం వచ్చింది. సుదీప్‌ హీరోగా శివకార్తీక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కోటిగొబ్బ 3’. సూరపబాబు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు హీరో సుదీప్‌నే కథ అందించడం విశేషం. ఇందులో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు శ్రద్ధాదాస్‌. ఈ సినిమా షూటింగ్‌ సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో ఈ నెల 17న మొదలు కానుంది.‘‘నా డ్రీమ్‌ రోల్‌ చేయబోతున్నా. పోలీసాఫీసర్‌ పాత్ర చేసే చాన్స్‌ రావడం, సుదీప్‌ సార్‌ హీరోగా నటిస్తున్న సినిమాకి అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రద్ధా. నాగన్న దర్శకత్వంలో రూపొంది న ‘కోటిగొబ్బ’ ఫస్ట్‌ పార్ట్‌లో విష్ణువర్థన్‌ హీరోగా నటించారు. ‘కోటిగొబ్బ 2’లో హీరోగా నటించిన సుదీప్‌ 3లో కూడా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement