-
కల నిజమాయె
ఇండస్ట్రీలోకి కాలు పెట్టిన యాక్టర్స్ అందరికీ ఏదో ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. అలాగే కథానాయికగా శ్రద్ధాదాస్ కూడా పోలీస్ క్యారెక్టర్‌ను డ్రీమ్ రోల్‌గా భావించారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పదేళ్ల తర్వాత ఆమె అనుకున్న డ్రీమ్ రోల్లో నటించే అవకాశం వచ్చింది. సుదీప్ హీరోగా శివకార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కోటిగొబ్బ 3’. సూరపబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హీరో సుదీప్‌నే కథ అందించడం విశేషం. ఇందులో ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు శ్రద్ధాదాస్. ఈ సినిమా షూటింగ్ సెర్బియాలోని బెల్గ్రేడ్లో ఈ నెల 17న మొదలు కానుంది.‘‘నా డ్రీమ్ రోల్ చేయబోతున్నా. పోలీసాఫీసర్ పాత్ర చేసే చాన్స్ రావడం, సుదీప్ సార్ హీరోగా నటిస్తున్న సినిమాకి అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రద్ధా. నాగన్న దర్శకత్వంలో రూపొంది న ‘కోటిగొబ్బ’ ఫస్ట్ పార్ట్‌లో విష్ణువర్థన్ హీరోగా నటించారు. ‘కోటిగొబ్బ 2’లో హీరోగా నటించిన సుదీప్ 3లో కూడా చేస్తున్నారు. -
అర్జున్ రెడ్డి కోరిక ఏంటో తెలుసా ?
విజయ్ దేవరకొండ నటించిన చిత్రం అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దీంతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఈసినిమా ఘన విజయం అనంతరం విజయ్ తరువాతి సినిమాపై టాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. అయితే విజయ్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. శ్రీరస్తు శుభమస్తుతో హిట్ కొట్టిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రొటీన్ సినిమాలకు, కమర్షియల్ సినిమాల కన్నా, ఏదైనా కొత్తదనం ఉన్న కథలకు ప్రాధాన్యం ఇస్తానని విజయ్ గతంలోనే తెలిపాడు. అయితే అర్జున్ రెడ్డి మనసులో మాత్రం ఓ కోరిక ఉంది. ఒక మంచి యాక్షన్ తరహాలో గ్యాంగ్‌స్టర్ సినిమాను చేయాలని ఉందట. ఇటీవల ఒక కన్నడ సినిమా ఆడియో వేడుకకు అతిథిగా వెళ్లిన విజయ్ మనసులోని కోరికను చెప్పాడు. విజయ్ - పరశురామ్ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న రష్మీక మందాన, గణేష్ సరసన చమక్ అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది. ఈ ఆడియో వేడుకలో పాల్గొన్న విజయ్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఫ్తీ ట్రైలర్‌ని చూసి తనకు కూడా అలాంటి గ్యాంగ్‌స్టర్ నేపథ్యం ఉన్న చిత్రంలో నటించాలని ఉందని చెప్పాడు. -
క్వీన్‌గా నటించాలని ఉంది
క్వీన్నవ్వాలన్నది తన డ్రీమ్ అంటోంది నటి రకుల్‌ప్రీతి. కోలీవుడ్‌లో వర్ధమాన హీరోలతో రెండు మూడు చిత్రాల్లో నటించినా విజయాలు చేరువకాకపోవడంతో టాలీవుడ్‌పై దృష్టి సారించిన ఈ ఉత్తరాది బ్యూటీకి అక్కడ అదృష్టం తేనెతుట్టెలా పట్టింది. సమంత, కాజల్ అగర్వాల్ వంటి టాప్ హీరోయిన్ల కోలీవుడ్ బాట పట్టడంతో రకుల్‌ప్రీతి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అ యిపోయింది. యువ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లుఅర్జున్‌ల సరసన నటిస్తూ రకుల్ తెగ బిజీ అయిపోయింది. రవితేజతో నటించిన కిక్ 2 చిత్రం త్వరలో తెరపైకి రానుంది. తదుపరి అల్లుఅర్జున్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్న రకుల్‌ప్రీతి తన డ్రీమ్‌రోల్ ఏమిటన్న ప్రశ్నకు హిందీ చిత్రం క్వీన్‌లో కంగనారౌత్ పోషించిన పాత్రలాంటిది చెయ్యాలన్నది తన డ్రీమ్ అని టక్కున చెప్పిం ది. స్త్రీ భావాలను ఆవిష్కరించిన చిత్రం క్వీన్ అ ని ఆ చిత్రం ప్రజాదరణ పొందడమే కాకుండా అందులో కథానాయికిగా నటించిన కంగనారౌత్ జాతీయ అవార్డును తెచ్చిపెట్టిందని పేర్కొంది. ఆ చిత్రంలోని హీరోయిన్ పాత్ర తనను బాగా ఆకట్టుకుందని అంది. అలాంటి పాత్రల్లో నటిం చాలన్న తన డ్రీమ్ అని అంది. క్వీన్ చిత్ర దక్షిణాది హక్కులు సీనియర్ నటుడు, నిర్మాత త్యాగరాజన్ చేతిలో ఉన్నా యి. ఇందులో నటించమని నటి స మంతను అడగ్గా హిందీలో విజ యం సాధించిన చిత్రాలు దక్షిణాది లో సక్సెస్ అవుతాయని గ్యారెంటీ ఉండదని నిరాకరించినట్లు ప్రచా రం జరిగింది. మరి తన డ్రీమ్ రో ల్ అంటున్న రకుల్‌ప్రీతి గోడు త్యాగరాజన్ ఆలకిస్తారా? అన్నది వేసిచూడాల్సిందే. -
కిస్ అన్నది వ్యక్తిగత విషయం :శోభన
పిల్లల మనోభావాలతో ఆడుకోకండి ⇒నాకెలాంటి డ్రీమ్ రోల్స్ లేవు ⇒నటిగా ఎదగడానికి నృతం సహకరిస్తుంది. ⇒కిస్ అన్నది వ్యక్తిగత విషయం ⇒ఏ తల్లిదండ్రులు కూడా తమ కూతురును ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పరనుకుంటా! ⇒‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ నటి, నాట్యకారిణి శోభన సాక్షి,బెంగళూరు : అచ్చమైన అందానికి ప్రతిబింబంలా కనిపించే ముద్దుగుమ్మ, కేరళలో పుట్టి పెరిగినా అచ్చంగా పదహారణాల తెలుగింటి అమ్మాయిలా కనిపించే అందాల భరిణె, మంచి నటిగానే కాదు మరెంతో మంచి నాట్యకారిణిగా కూడా ప్రపంచానికి సుపరిచితురాలే. ఈ వర్ణనంతా బహుభాషా నటి, నాట్యకారిణి శోభన గురించే. అవును అనాధ చిన్నారుల కోసం తాను నిర్వహించనున్న ఓ కార్యక్రమం కోసం నగరానికి వచ్చిన శోభన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అనాథల సహాయార్థం 20న ‘శోభన’ నృత్య రూపకం తల్లిదండ్రులను కోల్పోన పిల్లలు, ఆప్తుల నుంచి దూరంగా ఉంటున్న వృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ‘విశ్రాంతి’ స్వచ్ఛంద సంస్థకు చేయూత నందించడానికి బహు భాషనటి, ప్రముఖ నర్తకి శోభన ముందుకు వచ్చారు. స్వయంగా రూపకల్పన చేసిన ‘సమాధిన’ నృత్యరూపకాన్ని ఇక్కడి చౌడయ్యమెమోరియల్ హాల్లో ఈనెల 20న ప్రదర్శించనున్నారు. సాయంత్రం 6:30 గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు సాగే ఈ నృత్యరూపంలో వివిధ మత గ్రంథాల నుంచి తీసుకున్న శాంతి సందేశాలను ప్రదర్శించనున్నారు. సాక్షి: బహుభాష నటిగా పేరొందిన మీకు ఏ భాషలో నటించడం సులభం? శోభన: ఒక నటిగా అన్ని భాషలూ నాకు సమానమే, ఎ క్కువ సినిమాలు చేసే అవకాశం తెలుగులో కలిగింది. అదే విధంగా కన్నడ,తమిళ భాషల సినిమాలు కూడా నాకు మంచి నటిగా గుర్తింపును అందించాయి. అయితే నా మాతృభాష అయిన మళయాళంలో నటించడం సులభంగా అనిపిస్తుంది. సాక్షి: మీరు నటిగా చెప్పుకోవడానికి ఇష్టపడుతారా? నృత్యకారిణిగానా? శోభన: రెండూ వేటికవే విభిన్నమైనవి. సితార దేవి నుంచి నా స్నేహితురాలైన భానుప్రియను నటిగా గుర్తిస్తారా లేదా నృత్యకారిణిగా గుర్తిస్తారా అంటే మీరేం చెప్పగలుగుతారు? మంచి నటిగా ఎదిగేందుకు నృత్యం సహకరిస్తుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సాక్షి: మీకున్న డ్రీమ్ రోల్ ఏంటి? శోభన: డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. నాకు ఇచ్చిన ఏ పాత్రనైనా సమర్థవంతంగా పోషించడం మాత్రమే నాకు తెలుసు. ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నీ నా డ్రీమ్ రోల్స్ అనే చెబుతాను. సాక్షి: ఎవరితోనైనా కలిసి నటించలేకపోయానన్న భాద ఉందా? శోభన: అలాంటిదేమీ లేదు. మణిరత్నం, భాగ్యరాజ్, రాఘవేంద్ర రావు వంటి హేమాహేమీల దర్శకత్వంలో చాలా మంది గొప్ప నటులతో నేను నటించాను. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆ సినిమాల విజయంలో నా వంతు పాత్ర ఉందని గర్వపడుతుంటాను. సాక్షి: ఇంతకాలంగా నృత్యాలను ప్రదర్శిస్తున్నారు? ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు ఏంటి? శోభన: ఇప్పటి ప్రేక్షకులు చాలా తెలివైన వారు, వేదికపై నృత్యం చేస్తున్న వారిని అనుక్షణం గమనిస్తూనే ఉంటారు. చిన్న తప్పును కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ప్రదర్శన ఇస్తున్న నాట్యకారిణి నుండి తమకు ఎటువంటి భావాలు కావాలో ముందుగానే నిర్ణయించుకుంటారు. అలాంటా ప్రదర్శనలకే వస్తున్నారు. సాక్షి: శ్రీ కృష్ణుడి తత్వాలపై ఎక్కువ నృత్యరూపకాలు రూపొందిస్తుంటరనేది ప్రేక్షకుల అభిప్రాయం. దీనికి ఏమంటారు? శోభన: అటువంటి దేమీ లేదు. అన్ని మతాలకు, అందరి దేవుళ్లకు సంబంధించిన నృత్యరూపకాలు నాకు ఇష్టమే. అయితే కృష్ణుడి నృత్యరూపకాల వల్ల నాకు ఎక్కువ పేరు రావడం వల్ల మీకు అలా అనిపిస్తోంది. సాక్షి: ప్రస్తుతం వస్తున్న రియాలిటీ షోలపై మీ అభిప్రాయం ఏమిటి? శోభన: చిన్నారుల్లో ఇష్టం, ప్రతిభ ఉండి వారు నాట్యం, సంగీతం వంటి కలలు నేర్చుకుంటే ఫర్వాలేదు, అంతేకానీ తమ పిల్లలు టీవీల్లో కనిపించడంతో పాటు వారి ద్వారా తమకు పేరు రావాలనే కోరికతో కొంతమంది తల్లిదండ్రులు చిన్నారులపై బలవంతంగా ఈ తరహా రియాలిటీ షోలకు తీసుకొస్తున్నారు. తద్వారా చిన్నారులపై మానసిక ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఇక చానల్స్ కూడా పిల్లల భావోద్వేగాలతో తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఇది నా స్వ అనుభవం.్ఙఒక డ్యాన్స్ షో ఫైనల్స్‌లో 24 ఏళ్ల యువకుడికి, 9ఏళ్ల అబ్బాయికి పోటీ పెట్టారు. ఇందులో 24ఏళ్ల యువకుడు గెలిచాడు. అంతే తొమ్మిదేళ్ల అబ్బాయి తన భావోద్వేగాలను ఆపుకోలేక కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతను శారీరకంగా, మానసికంగా కూడా కుంగిపోయాడు. ఇక షోలోని న్యాయనిర్ణేతలకు సైతం ఎక్కువ డ్రామాను పండిస్తూ, టీఆర్పీని పెంచే విధంగా భావోద్వేగాలను పలికించాలని చెబుతున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. అందుకే నేను రియాల్టి షోలకు ఎక్కువగా న్యాయనిర్ణేతగా వెళ్లను. సాక్షి: మోరల్ పోలిసింగ్‌కు నిరసిస్తూ కేరళాలో ప్రాణం పోసుకున్న కిస్ ఆఫ్ లవ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీని పై మీ కామెంట్? శోభన: ముద్ద అన్నది వ్యక్తిగతమైన విషయం. ‘చాలా మంది బయటికి బహిరంగంగా కిస్ ఆఫ్ లవ్ సాధారణ విషయమని చెబుతుంటారు. అయితే వ్యక్తిగతంగా వస్తే తమ కూతురు కిస్ ఆఫ్ లవ్‌లో పాల్గొనడానికి ఎంతమాత్రం అంగీకరించరు.’ అనేది నా అభిప్రాయం. అయినా ఈ విషయం మంచి ఈ వి షయం మంచిది కాదు అని చెప్పడానికి మనం ఎవరం చెప్పండి. కొంతమందికి మంచి అనిపిం చేంది మరొకొందరికి స మంజసం కాకపోవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్‌కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement