జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌

Shekhar Suman launches Justice For Sushant forum - Sakshi

బాలీవుడ్‌లో బయటినుంచి వచ్చేవారికన్నా వారసులకు ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందని, ఇక్కడ బంధుప్రీతి బాగా ఉంటుందని పలువురు ప్రముఖులు బాహాటంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్యకు ఇదో కారణం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌’ అనే ఫోరమ్‌ ఏర్పాటు చేసినట్లు నటుడు శేఖర్‌ సుమన్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

‘‘మంచి ప్రతిభ, బలమైన సంకల్పం ఉన్న సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడటం నన్ను నిరాశకు గురిచేసింది. అతని ఆత్మహత్యకు గల కారణాలను కొందరు దాస్తున్నారు. వాటన్నింటినీ మా ఫోరమ్‌ వెలుగులోకి తీసుకొస్తుంది. తన ఆత్మహత్యపై సీబీఐ విచారణకు మా ఫోరమ్‌ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన మాఫియాకు వ్యతిరేకంగా ‘జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌’ ఫోరమ్‌ పోరాడుతుంది. సినీ పరిశ్రమలోని గ్రూపు రాజకీయాలను, నిరంకుశత్వాన్ని అంతమొందించేందుకు పని చేస్తాం’’ అన్నారు.

ఇప్పటికి మూడు సినిమాలు
బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం ఆధారంగా తెరకెక్కనున్న సినిమాల సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది. ఈ నెల 14న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత షామిక్‌ మౌలిక్‌ దర్శకత్వంలో సుశాంత్‌ జీవితం ఆధారంగా ‘సూసైడ్‌ ఆర్‌ మర్డర్‌: ఏ స్టార్‌ వాజ్‌ లాస్ట్‌’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు విజయ్‌శేఖర్‌ గుప్తా ప్రకటించారు. దర్శకుడు నిఖిల్‌ ఆనంద్‌ కూడా సుశాంత్‌ బయోపిక్‌ తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.

తాజాగా సుశాంత్‌ జీవితం ఆధారంగా ‘సుశాంత్‌’ అనే చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు సునోజ్‌ మిశ్రా. ఇంతకుముందు ‘గాంధీ గిరి’, ‘శ్రీనగర్‌’ చిత్రాలను డైరెక్ట్‌ చేశారు సునోజ్‌ మిశ్రా. ‘సుశాంత్‌’ చిత్రం గురించి సనోజ్‌ మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలోని వేధింపుల వల్ల కఠిన నిర్ణయాలు తీసుకున్నవారందరికీ సంబంధించినదే ఈ చిత్రం. రోడ్‌ ప్రొడక్షన్, సనోజ్‌ మిశ్రా ఫిల్మ్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ముంబై, బీహార్‌ లొకేషన్స్‌లో మేజర్‌ షూటింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top