యస్‌ అండ్‌ యస్‌ 96కి ఫిక్స్‌ | Sharwanand and Samantha in 96 Telugu remake | Sakshi
Sakshi News home page

యస్‌ అండ్‌ యస్‌ 96కి ఫిక్స్‌

Jan 27 2019 3:20 AM | Updated on Jan 27 2019 3:20 AM

Sharwanand and Samantha in 96 Telugu remake - Sakshi

శర్వానంద్, సమంత

తమిళ బ్లాక్‌బస్టర్‌ ‘96’ తెలుగులో రీమేక్‌ కానుందన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ. ఇందులో శర్వానంద్, సమంత జంటగా నటించనున్నారు. తమిళ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన సి.ప్రేమ్‌ కుమార్‌ ఈ చిత్రానికీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ‘దిల్‌’ రాజు నిర్మాత. ‘‘మా సంస్థలో చేస్తోన్న 34వ ప్రాజెక్ట్‌లో శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తారని ప్రకటించడం హ్యాపీగా ఉంది. మార్చి నెలలో షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని పేర్కొంది చిత్రబృందం. తమిళ ‘96’ స్క్రిప్ట్‌ను తెలుగు నేటివిటీకు తగ్గట్టు పలు మార్పులు చేశారట. చిన్ననాటి స్నేహితులంతా మళ్లీ కలుసుకోవడం అనే కాన్సెప్ట్‌తో చిత్రకథ సాగుతుంది. రెండు, మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో శర్వానంద్, సమంత కనిపిస్తారు. ఈ  సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement