శర్వా @ త్రీ షేడ్స్‌! | Sharwanand and Samantha in “96” Telugu remake | Sakshi
Sakshi News home page

శర్వా @ త్రీ షేడ్స్‌!

Dec 17 2018 1:14 AM | Updated on Dec 17 2018 1:14 AM

Sharwanand and Samantha in “96” Telugu remake - Sakshi

శర్వానంద్‌, సమంత

‘పడి పడి లేచె మనసు’ అంటూ ఈ శుక్రవారం ఓ ప్రేమకథను మన ముందుకు తీసుకువస్తున్న శర్వానంద్‌ మరో లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం. విజయ్‌ సేతుపతి, త్రిష కాంబినేషన్‌లో ప్రేమ్‌కుమార్‌ తెరకెక్కించిన ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ ‘96’. తమిళనాట ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. వెంటనే తెలుగు రీమేక్‌ హక్కులను ‘దిల్‌’ రాజు సంపాదించుకున్నారు. ఈ రీమేక్‌లో శర్వానంద్‌ హీరోగా నటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇందులో హీరోయిన్‌గా సమంత నటించనున్నారని టాక్‌. ఆల్రెడీ శర్వానంద్‌ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి సూపర్‌హిట్‌ లవ్‌స్టోరీలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుధీర్‌వర్మతో చేస్తోన్న గ్యాంగ్‌స్టర్‌ డ్రామా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. ఆ తర్వాత ‘96’ రీమేక్‌ పట్టాలెక్కుతుందట. ఒరిజినల్‌ వెర్షన్‌ డైరెక్ట్‌ చేసిన ప్రేమ్‌ కుమారే ఈ రీమేక్‌కు దర్శకుడు. కాగా, తమిళ వెర్షన్‌లో హీరో ట్రావెల్‌ ఫొటోగ్రాఫర్‌. 15 ఏళ్లు, 19 ఏళ్లు, 37 ఏళ్ల వయసుతో మూడు రకాల షేడ్స్‌లో విజయ్‌ సేతుపతి కనిపించారు. సో.. రీమేక్‌లోనూ హీరో పాత్ర అదే పోషించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement