బాహుబలి కంటే భారీ చిత్రంలో ప్రభాస్‌? | Shankar Intended To Make A Big Budget Movie With Prabhas | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌పై కన్నేసిన సౌతిండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌?

Dec 12 2019 5:50 PM | Updated on Dec 12 2019 6:09 PM

Shankar Intended To Make A Big Budget Movie With Prabhas - Sakshi

హాలీవుడ్‌ రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో పాటు తనదైన స్టైల్లో మెసేజ్‌ ఓరియెంటెడ్‌

‘బాహుబలి’ తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ క్రేజ్‌ ఖండాంతరాలు దాటింది. దీంతో ఈ స్టార్‌ హీరోతో సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘జిల్‌’ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత ప్రభాస్‌ తదుపరి మూవీ ఏంటనే దానిపై అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ వార్త ప్రభాస్‌ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. సౌతిండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ప్రభాస్‌తో ఓ చిత్రానికి ప్లాన్‌ చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. శంకర్‌కు భారీ సినిమాలను తీయడంలో స్పెషలిస్టు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఇప్పటికే రోబో, 2.0 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలన శంకర్‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే. 

‘సాహో’ సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్‌ మాత్రం బాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకున్నాడు. దీంతో ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌తో భారీ బడ్జెట్‌తో పాటు తన మార్క్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని తీయాలని శంకర్‌ భావిస్తున్నట్లు.. ఇప్పటికే ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్‌ను కూడా సిద్దం చేసినట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ హై బడ్జెట్‌ మూవీని దిల్‌ రాజు నిర్మించబోతు​న్నట్లు అనధికారిక సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే శంకర్‌ డైరెక్ట్‌ చేయబోతున్న తొలి తెలుగు హీరోగా ప్రభాస్‌ నిలవనున్నాడు. గతంలో పలుమార్లు తెలుగు హీరోలతో సినిమా తీయాలని శంకర్‌ భావించినప్పటికీ ఫర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌ కుదరలేదు. 

కాగా, ఈ చిత్రాన్ని బాహుబలి కంటే భారీ రేంజ్‌లో తీయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు కూడా అనేక వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ప్రభాస్‌ ‘కేజీఎఫ్‌’ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ చెప్పిన స్టోరీ లైన్‌కు ఓకే చెప్పినట్లు.. పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని సూచించారని మరో వార్త హల్‌చల్‌ చేస్తోంది. మరోవైపు కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’ చిత్రంతో బిజీగా ఉన్న శంకర్‌.. ఈ మూవీ తర్వాతనే ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట. అయితే కోలీవుడ్‌ మాత్రం కమల్‌ సినిమా తర్వాత చియాన్‌ విక్రమ్‌తో శంకర్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తారని అంటోంది. అయితే ‘భారతీయుడు 2’తర్వాత శంకర్‌ డైరెక్ట్‌ చేయబోయేది విక్రమ్‌తోనా లేక ప్రభాస్‌తోనా అని సినీ విశ్లేషకులు తెగ చర్చించుకుంటున్నారు.  

చదవండి: 
పదేళ్లల్లో పదో స్థానం
కాంబినేషన్‌ కుదిరేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement