కాంబినేషన్‌ కుదిరేనా?

KGF director Prashanth Neel to direct Prabhas? - Sakshi

‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 1’ చిత్రంతో ఇండియాలో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారు కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో మంచి మాస్‌ డైరెక్టర్‌ అనే ముద్ర పడింది. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2’ చిత్రీకరణలో ఉన్నారు ప్రశాంత్‌ నీల్‌. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్, మహేశ్‌బాబులను ఆల్రెడీ ప్రశాంత్‌ నీల్‌ కలిసినట్టు సమాచారం ఉంది. తాజాగా ప్రభాస్‌తో ఓ కథ విషయమై కలిశారని తెలిసింది. ఈ మీటింగ్‌లో ఈ ఇద్దరూ ఓ ఐడియాను చర్చించుకున్నారట. మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందా? వేచి చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top