శనిదేవుని మహిమలు | 'Shani Devudu' Movie Press Meet -Suman, Akash, | Sakshi
Sakshi News home page

శనిదేవుని మహిమలు

Feb 17 2014 12:11 AM | Updated on Sep 2 2017 3:46 AM

శనిదేవుని మహిమలు

శనిదేవుని మహిమలు

‘శనిదేవుడు మంచివాడు.. చెడ్డవాడుకాదు’ అనే నినాదంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘శనిదేవుడు’. ‘మహిమలు చూడండి’ అనేది ఉపశీర్షిక. శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న

‘శనిదేవుడు మంచివాడు.. చెడ్డవాడుకాదు’ అనే నినాదంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘శనిదేవుడు’. ‘మహిమలు చూడండి’ అనేది ఉపశీర్షిక. శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్  జరుపుకుంటోంది. ఉగాదికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శివ మాట్లాడుతూ- ‘‘మనిషి ఆయుష్షు 120 ఏళ్లు అనుకుంటే... అందులో 19ఏళ్లు శనిదశ నడుస్తుంది. ఆ 19 ఏళ్లు.. కష్టాల విలువ, జీవితం గొప్పదనం, బాధ్యతలు, బంధాల విలువల్ని కూడా తెలియజేస్తాయి. శనిదశ ముగింపుకి చేరుకున్నప్పుడు ఆయన మంచి చేసే తప్పుకుంటాడు. సూర్యుణ్ణి ప్రత్యక్ష నారాయణునిగా కొలిచే మనం ఆయన కుమారుడు శనిని ఎందుకు నిందిస్తాం? ఈ విషయంపై పరిశోధన జరిపి, పలువురు పండితుల అభిప్రాయాలను తీసుకొని శని గొప్ప దేవుడు అని చెప్పడమే పరమావధిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అని తెలిపారు. అహంకారమే ఆభరణంగా చేసుకున్న మహారాజు పాత్రను చేస్తున్నానని సుమన్ చెప్పారు. ఇందులో ఓ ముఖ్యమైన పాట చేశానని ఆకాష్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement