మరో అవతారంలో షాలినీ... 

shalini pandey naa pranama song released on feb 14th - Sakshi

అర్జున్‌రెడ్డి  ఫేమ్‌ షాలీనీ పాండే ‘నా ప్రాణమై...’ అంటూ సాగే ఓ ప్రైవేట్‌ సాంగ్‌ను ఇటీవల రికార్డ్‌ చేశారు. ‘లగోరీ’ అనే ఇండియన్‌ బ్యాండ్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటకు షాలినీ తన వాయిస్‌ అందించారు. వాలెంటైన్స్‌ డే సందర్భంగా  ఈ పాటను రిలీజ్‌ చేశారు. షాలినీ మొదటి సినిమాలోనే  తెలుగు డబ్బింగ్‌ చెప్పుకుని ‘బేబీ.. బేబీ... ’ అంటూ ఆడియన్స్‌ను అలరించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఏకంగా తెలుగులో పాట పాడి  ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. 

ఇదిలా ఉంటే  షాలినీ ‘అర్జున్‌ రెడ్డి’  సినిమా సూపర్‌ సక్సెస్‌ తర్వాత వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లిపోతున్నారు. సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’ సినిమాలో, జీ.వీ.ప్రకాశ్‌తో ‘100% లవ్‌’ తమిళ రీమేక్‌ ‘100% కాదల్‌ లో, జీవా సరసన ‘గొరిల్లా’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top