‘మా అన్న నాకు టీచర్‌ లెక్క.. పోటీ కానేకాదు’ | Shahid Kapoor Like A Teacher : Ishaan Khatter | Sakshi
Sakshi News home page

‘మా అన్న నాకు టీచర్‌ లెక్క.. పోటీ కానేకాదు’

Jan 30 2018 9:05 AM | Updated on Apr 3 2019 6:23 PM

Shahid Kapoor Like A Teacher : Ishaan Khatter - Sakshi

ఇషాన్‌ ఖట్టర్‌ (షాహిద్‌ కపూర్‌ సోదరుడు)

సాక్షి, న్యూఢిల్లీ : తన సోదరుడు తనకు ఉపాధ్యాయుడులాంటివాడని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖట్టర్‌ అన్నాడు. తానెప్పుడు తన సోదరుడికి పోటీ కానేకాదని, అలా ఎప్పటికీ తాను అనుకోనని చెప్పాడు. మాజిద్‌ మాజిది దర్శకత్వంలో ఇండో-ఇరానియన్‌ చిత్రం బియాండ్‌ ది క్లౌడ్‌ ద్వారా ఇషాన్‌ బాలీవుడ్‌ చిత్రరంగంలోని ఆరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల కార్యక్రమంలో ఇషాన్‌ మాట్లాడాడు.

తన సోదరుడు షాహిద్‌కు గట్టి పోటీ ఇస్తారని భావిస్తురా అని మీడియి ప్రతినిధులు ప్రశ్నించగా ‘కాదు.. అలా ఎప్పటికీ జరగదు. ఆయనకు నాకు ఉపాధ్యాయుడులాంటి వారు. అంతేకాదు తండ్రితో సమానమైనవాడు. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను ఆయనకు పోటీ అని ఎప్పటికీ అనుకోను.. దానికి బదులు మేమంతా ఒకటే అని చెబుతాను’ అని అన్నాడు. బియాండ్‌ దిక్లౌడ్‌ చిత్రానికి ఏఆర్‌ రహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement