బిల్‌గా బాద్‌షా? | Shah Rukh Khan In Talks For Kill Bill Hindi Remake | Sakshi
Sakshi News home page

బిల్‌గా బాద్‌షా?

Sep 30 2019 12:01 AM | Updated on Sep 30 2019 12:01 AM

Shah Rukh Khan In Talks For Kill Bill Hindi Remake - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నెక్ట్స్‌ ఏ చిత్రంలో నటించబోతున్నారు? అనే ప్రశ్నకు బాలీవుడ్‌లో భిన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. హాలీవుడ్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘కిల్‌ బిల్‌’ హిందీలో రీమేక్‌ కానుందట. నటుడు–నిర్మాత నిఖిల్‌ దివేది హిందీ సినిమా రీమేక్‌ రైట్స్‌ను దక్కించుకున్నారని బాలీవుడ్‌ టాక్‌. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారట నిఖిల్‌. ఆల్రెడీ ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా ప్రారంభించారట.

ఈ సినిమాలో విలన్‌ బిల్‌ పాత్రలో నటించాల్సిందిగా షారుక్‌తో సంప్రదింపులు జరిపారట నిఖిల్‌. మరి.. షారుక్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారా? వెయిట్‌ అండ్‌ సీ. మరోవైపు తమిళ హీరో విజయ్‌ నటించిన ‘బిగిల్‌’ సినిమాలో షారుక్‌ ఓ అతిథిగా నటించారని ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. షారుక్‌ హీరోగా నటించిన ‘జీరో’ గతేడాది డిసెంబరులో విడుదలైంది. ప్రస్తుతం షూటింగ్స్‌ లేవు కాబట్టి, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేయడానికి ఇదే సరైన సమయమని, కొడుకు అబ్రామ్‌తో టైమ్‌ గడుపుతూ షారుక్‌ చాలా హ్యాపీగా ఉన్నారని అంటున్నారు ఆయన సతీమణి గౌరీ ఖాన్‌.

Advertisement
 
Advertisement
Advertisement