‘ఓటింగ్‌కి.. బోటింగ్‌కి తేడా తెలీడం కోసం తీసుకొచ్చా’ | Shah Rukh Khan Comments Over Takes Son AbRam To Polling | Sakshi
Sakshi News home page

కుమారుడితో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన షారుక్‌

Apr 29 2019 8:47 PM | Updated on Apr 29 2019 8:51 PM

Shah Rukh Khan Comments Over Takes Son AbRam To Polling - Sakshi

వాణిజ్య రాజధాని ముంబైతో సహా దేశవ్యాప్తంగా 71 నియోజకవర్గాల్లో సోమవారం నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో సినీ, వ్యాపార ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో బాద్‌షా షారుక్‌ ఖాన్‌ దంపతులు కూడా ఉన్నారు. అయితే ఓటు వేయడానికి వచ్చేటప్పుడు తమతో పాటు ఐదేళ్ల తన కుమారుడు అబ్రాంను కూడా పోలింగ్‌ కేంద్రానికి తీసుకువచ్చారు షారుక్‌.

ఈ విషయంపై స్పందిస్తూ ‘మా చిన్నారికి ఓటింగ్‌కు.. బోటింగ్‌కు తేడా తెలీక ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం గురించి తనకు పూర్తిగా అర్థం కావడం కోసమే ఇలా తీసుకొచ్చాం’ అంటూ ట్వీట్‌ చేశారు షారుక్‌. దాంతో పాటు భార్య, కొడుకు అబ్రాంతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్‌ చేశారు. షారుక్‌ ఖాన్‌ తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement