కేప్‌ టౌన్లో కింగ్‌ | Leaked images from the set of Shah Rukh Khan King | Sakshi
Sakshi News home page

కేప్‌ టౌన్లో కింగ్‌

May 3 2026 12:34 AM | Updated on May 3 2026 12:34 AM

Leaked images from the set of Shah Rukh Khan King

దక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్లో ల్యాండ్‌ అయ్యారు కింగ్‌. ‘పఠాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా తర్వాత హీరో షారుక్‌ ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘కింగ్‌’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌  హీరోయిన్. షారుక్‌ ఖాన్ తనయ సుహానా ఖాన్, అభిషేక్‌ బచ్చన్ ఇతర ప్రధాన  పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్లో జరుగుతోంది. షారుక్‌ – దీపిక  పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో కొంత టాకీ  పార్టుతో  పాటు ఓ  పాట, ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం.

కాగా కేప్‌ టౌన్లో షారుక్‌–దీపికల మధ్య చిత్రీకరిస్తున్న కొన్ని విజువల్స్, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఈ విషయంపై దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ స్పందించారు.      ‘‘కింగ్‌’ సినిమా సెట్స్‌ నుంచి లీకైన ఫొటోలను సోషల్‌ మీడియా మాధ్యమాల్లో షేర్‌ చేయకండి. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్ ను అందించేందుకు మా టీమ్‌ అంతా ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. థియేటర్స్‌లో బిగ్‌ స్క్రీన్పై సర్‌ప్రైజెస్‌ కోసం వేచి చూద్దాం’’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు సిద్ధార్థ్‌ ఆనంద్‌. గౌరీ ఖాన్, సిద్ధార్థ్‌ ఆనంద్, మమతా ఆనంద్‌ నిర్మిస్తున్న ‘కింగ్‌’ సినిమా ఈ ఏడాది డిసెంబరు 24న రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement