ప్రేమే ముఖ్యం | Shah Rukh Khan Becomes A Teacher And His Lockdown | Sakshi
Sakshi News home page

ప్రేమే ముఖ్యం

May 17 2020 12:21 AM | Updated on May 17 2020 12:21 AM

Shah Rukh Khan Becomes A Teacher And His Lockdown - Sakshi

లాక్‌ డౌన్‌ సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమయాన్ని గడుపుతున్నారు. కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. షారుక్‌ ఖాన్‌ ఈ లాక్‌ డౌన్‌ చాలా విషయాలు నేర్పింది అంటున్నారు. ఈ విషయం గురించి తన ట్వీటర్‌లో ఓ నోట్‌ని పంచుకున్నారు. ‘‘మనందరం మనకి కావాల్సిన విషయాలను వదిలి ఇంకా దేనికోసమో పరిగెడుతున్నామేమో? అవి మనకి నిజంగా ముఖ్యం కాకపోయినా ముఖ్యమనే భ్రమలో పరిగెడుతున్నామేమో? మనకి చాలా ముఖ్యమైనవాళ్లు, మనతో నిలబడే నలుగురు మనతో ఉంటే చాలదా? ఈ లాక్‌ డౌన్‌ సమయంలో గతంలో మనమెందుకు హడావిడిగా పరుగులు తీశాం అని  ఆలోచిద్దాం. మనకు ఏం కావాలో తెలుసుకుందాం.  ప్రేమకి మించి మనకు ఏదీ ఎక్కువ కాదు అని అర్థం చేసుకోండి’’ అని రాసుకొచ్చారు షారుక్‌.

Advertisement
 
Advertisement
Advertisement