ఎక్కువ కాలేదు... తక్కువ కాలేదు... ఎవరూ చావలేదు! | Saturday was cooking at Samantha home. | Sakshi
Sakshi News home page

ఎక్కువ కాలేదు... తక్కువ కాలేదు... ఎవరూ చావలేదు!

Nov 5 2017 12:33 AM | Updated on Nov 5 2017 12:33 AM

Saturday was cooking at Samantha home. - Sakshi

ఎక్కువ కాలేదు... తక్కువ కాలేదు! ఏంటది? వంట అండ్‌ వంటలోకి కావలసిన దినుసులు గట్రా! సమంత వండిన వంటలో ఏదీ ఎక్కువ కాలేదట... ఏదీ తక్కువ కాలేదట! యస్‌... శనివారం సమంత ఇంట్లో వంట చేశారు. ఎందుకు? అంటే... షూటింగ్‌ క్యాన్సిల్‌ అయ్యిందని! ఖాళీగా ఉండడంతో కిచెన్‌లోకి వెళ్లి... కూరగాయలు కట్‌ చేశారు. స్టవ్‌ అంటించి, నాన్‌స్టిక్‌ కడాయిపై నాన్‌వెజ్‌ కూడా కుక్‌ చేశారు. ఆ తర్వాత నా వంట తిని ఎవరూ చావలేదని సమంతే చెప్పారు. ‘నో వన్‌ డైడ్‌... యస్‌... స్‌స్‌!!’ అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో సమంత పేర్కొన్నారు.

షూటింగ్‌ క్యాన్సిల్‌ అయితే... ఆ రోజు వంట చేయడమే అని సోషల్‌ మీడియాలో ఆమె తెలిపారు. పెళ్లికి ముందు నాగచైతన్య వంట చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో ఎక్కువగా పోస్ట్‌ చేసేవారీమె. పెళ్లి తర్వాత తీరిక చిక్కినప్పుడల్లా ముద్దుల శ్రీవారికి సమంతే వంట చేస్తున్నట్టున్నారు. బహుశా... ‘నేను వంట చేశానోచ్‌’ అని సమంత పబ్లిగ్గా చెప్పుకోవడమూ ఇదే తొలిసారి అనుకుంటా! నా వంట తిని ఎవరూ చావలేదని చెప్పారు గానీ... టేస్ట్‌ ఎలా ఉందో ఆమె చెప్పలేదు. నెక్ట్స్‌ టైమ్‌ సమంత గానీ... చైతన్య గానీ... కలసినప్పుడు అడుగుదాంలెండి!!

Advertisement
 
Advertisement
Advertisement