రికార్డులు తిరగరాస్తున్న 'సరైనోడు' | Sarrainodu clocks 50 days, mints Rs 125 crore | Sakshi
Sakshi News home page

రికార్డులు తిరగరాస్తున్న 'సరైనోడు'

Jun 10 2016 11:59 AM | Updated on Sep 4 2017 2:10 AM

రికార్డులు తిరగరాస్తున్న 'సరైనోడు'

రికార్డులు తిరగరాస్తున్న 'సరైనోడు'

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను పూర్తిగా మాస్ గా చూపించిన చిత్రం సరైనోడు మరిన్ని రికార్డులు సృష్టిస్తోంది.

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను పూర్తిగా మాస్ గా చూపించిన చిత్రం సరైనోడు మరిన్ని రికార్డులు సృష్టిస్తోంది. యాక్షన్ మూవీల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు యాబై రోజుల మార్క్ ను చేరుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇప్పటికీ 115 థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. సమ్మర్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయినా ఈ సినిమా డివైడ్ టాక్తో స్టార్ట్ అయినా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మూవీతో ఇటీవల వంద కోట్ల క్లబ్ లో చేరాడు బన్నీ. ఇప్పటివరకూ రూ.125 కోట్ల కలెక్షన్లు సాధించి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా సరైనోడు నిలిచింది.

తెలుగు వెర్షన్లో రూ.119 కోట్లు, మలయాళంలో కూడా డబ్బింగ్ చేసిన ఈ మూవీ అక్కడ రూ.6 కోట్లు వసూలు చేసింది. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా అందాలు ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయ్యాయి. కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి నటన మూవీకి హైలెట్ గా నిలిచింది. ఏప్రిల్ 22న రిలీజ్ అయిన సరైనోడు అల్లు అర్జున్ రేంజ్ను భారీగా పెంచేసింది. బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సరైనోడు అని మూవీ విశ్లేషకుడు త్రినాథ్ పేర్కొన్నాడు. ఇటీవల కాస్త కామెడీ ట్రాక్ మూవీలు చేసిన అల్లు అర్జున్ ఈ మూవీలో ఫుల్ మాస్ క్యారెక్టర్లో కనిపించటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement