తీపి కబురు | sarileru neekevvaru released on january 12 | Sakshi
Sakshi News home page

తీపి కబురు

Oct 13 2019 12:22 AM | Updated on Oct 13 2019 12:22 AM

sarileru neekevvaru released on january 12 - Sakshi

మహేశ్‌బాబు

విహారయాత్ర కోసం స్విట్జర్లాండ్‌ వెళ్లిన మహేశ్‌బాబు హైదరాబాద్‌కు వచ్చీ రాగానే అభిమానులకు తీపి కబురు చెప్పారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఆర్మీ మేజర్‌ అజయ్‌కృష్ణ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోందని తెలిసింది. కోర్టు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement