పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త! | Sardar Gabbar Singh to hit the screens on April 8 | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త!

Jan 2 2016 6:46 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త! - Sakshi

పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త!

పవర్‌ స్టార్ పవన్‌కల్యాణ్‌ అభిమానులకు శుభవార్త. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా విడుదల తేదీ ఖరారైనట్టు సమాచారం.

హైదరాబాద్‌: పవర్‌ స్టార్ పవన్‌కల్యాణ్‌ అభిమానులకు శుభవార్త. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా విడుదల తేదీ ఖరారైనట్టు సమాచారం. ఏప్రిల్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' ప్రాజెక్టు విషయంలో బాగా జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తుది దశ షూటింగ్‌ ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది. 'జనవరి 4 నుంచి షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇది సుదీర్ఘమైన షెడ్యూల్. దాదాపు నెలపాటు ఉంటుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతుంది. సినిమా ఏప్రిల్‌లో విడుదల చేయాలని పవన్‌కల్యాణ్‌ భావిస్తున్నారు' అని చిత్రానికి సంబంధించి విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయి.. ఇంకా పోస్టు ప్రోడక్షన్‌ వర్క్‌లోకి వెళ్లకముందే సినిమా హక్కుల కోసం డిస్టిబ్యూటర్లు పోటీపడుతున్నట్టు తెలుస్తున్నది. 2012లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్‌' సినిమాకు 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సీక్వెల్‌గా వస్తున్నది.

Advertisement
 
Advertisement
Advertisement