రికార్డులు సృష్టిస్తోన్న సరైనోడు | sarainodu collection report | Sakshi
Sakshi News home page

రికార్డులు సృష్టిస్తోన్న సరైనోడు

May 31 2016 5:57 PM | Updated on Sep 4 2017 1:21 AM

రికార్డులు సృష్టిస్తోన్న సరైనోడు

రికార్డులు సృష్టిస్తోన్న సరైనోడు

అల్లు అర్జున్ హీరోగా మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరైనోడు. సమ్మర్ బరిలో రిలీజ్ అయినా ఈ సినిమా డివైడ్ టాక్తో స్టార్ట్ అయినా...

అల్లు అర్జున్ హీరోగా మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరైనోడు. సమ్మర్ బరిలో రిలీజ్ అయినా ఈ సినిమా డివైడ్ టాక్తో స్టార్ట్ అయినా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. బన్నీ కెరీర్లో హైయస్ట్ గ్రాసర్గా నిలిచిన సరైనోడు ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. చాలా కాలం తరువాత అల్లు అర్జున్  ఫుల్ మాస్ క్యారెక్టర్లో కనిపించటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఏప్రిల్ 22న రిలీజ్ అయిన సరైనోడు అల్లు అర్జున్ రేంజ్ను భారీగా పెంచేసింది. ఇప్పటికే వరుసగా 50 కోట్ల సినిమాలతో సత్తా చాటిన బన్నీ. ఈ సినిమాతో వంద కోట్ల కలెక్షన్లతో ఫాం చూపించాడు. వరల్డ్ వైడ్ గా 74 కోట్ల షేర్ వసూళు చేసిన సరైనోడు, తెలుగు,  హిందీ శాటిలైట్ రైట్స్ కూడా కలుపుకొని 90 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా చెపుతున్నారు. ఇప్పటికీ మంచి వసూళ్లు వస్తుండటంతో సరైనోడి ఖాతాలో ముందు ముందు మరిన్ని రికార్డ్లు కాయం అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement
 
Advertisement
Advertisement