కోలీవుడ్‌లో ‘బ్లాక్‌బస్టర్‌’ రీమిక్స్‌ | Sarainodu Block Buster Song Remix in Vishal Ayogya | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో ‘బ్లాక్‌బస్టర్‌’ రీమిక్స్‌

Feb 28 2019 2:01 PM | Updated on Feb 28 2019 2:02 PM

Sarainodu Block Buster Song Remix in Vishal Ayogya - Sakshi

ఎన్టీఆర్, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా టెంపర్‌. ఈ సినిమాలో విశాల్‌ హీరోగా అయోగ్య పేరుతో కోలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా స్టిల్స్‌ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

దీంతో సినిమాకు మరింత గ్లామర్‌ యాడ్‌ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్‌. అల్లు అర్జున్‌ సరైనోడు సినిమాలో బ్లాక్‌ బస్టర్‌ సాంగ్‌ను అయోగ్యలో రీమిక్స్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సరైనోడు సినిమా రీమేక్‌ రైట్స్‌ కూడా విశాల్ దగ్గరే ఉండటంతో బ్లాక్‌ బస్టర్ పాటను రీమిక్స్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాటతో విశాల్‌ తో పాటు శ్రద్ధాదాస్ ఆడిపాడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement