మహేష్‌తో మూవీపై సందీప్‌ క్లారిటీ | Sandeep Reddy Vanga Gives Clarity on About Movie with Mahesh Babu | Sakshi
Sakshi News home page

మహేష్‌తో మూవీపై సందీప్‌ క్లారిటీ

Jun 4 2019 10:42 AM | Updated on Jun 4 2019 10:43 AM

Sandeep Reddy Vanga Gives Clarity on About Movie with Mahesh Babu - Sakshi

ఇటీవల మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. అనిల్‌ సుంకర, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తున్నారు.

మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత చేయబోయే సినిమాపై కూడా చర్చ మొదలైంది. చాలా కాలంగా అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై సందీప్‌ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అర్జున్‌ రెడ్డి బాలీవుడ్ రీమేక్‌ కబీర్‌ సింగ్‌ పనుల్లో బిజీగా ఉన్న సందీప్‌, ఇప్పటికే మహేష్‌కు కథ వినిపించినట్టుగా తెలిపాడు.

లైన్‌ మహేష్‌కు నచ్చటంతో పూర్తి కథ సిద్ధం చేయమన్నారని, పూర్తి కథ చెప్పిన తరువాతే సినిమాపై క్లారిటీ వస్తుందని వెల్లడించారు. షాహిద్ కపూర్‌, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించిన కబీర్‌ సింగ్‌ జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement