‘సంపూ’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే! | Sampoornesh Babu Kobbari Matta Movie Release Date Announcement | Sakshi
Sakshi News home page

‘సంపూ’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే!

Jun 19 2019 1:35 PM | Updated on Jun 19 2019 1:39 PM

Sampoornesh Babu Kobbari Matta Movie Release Date Announcement - Sakshi

హృదయ కాలేయం సినిమాతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన కామెడీ నటుడు బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు. సోషల్‌ మీడియా ప్రమోషన్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన సంపూ, తరువాత ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. హీరోగా నటించిన సింగం 123తో పాటు కామెడీ రోల్స్‌ కూడా పెద్దగా క్లిక్‌ కాకపోవటంతో అవకాశాలు తగ్గిపోయాయి.

సంపూ మంచి ఫాంలో ఉండగానే కొబ్బరి మట్ట పేరుతో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. పోస్టర్‌లు, టీజర్‌లతో బాగానే హడావిడి చేశాడు. కానీ తరువాత ఆ సినిమా గురించి ఆడియన్స్‌ మర్చిపోయారు. అప్పుడప్పుడు పోస్టర్స్‌ రిలీజ్ చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుందని మరో పోస్టర్‌ రిలీజ్ చేశాడు సం‍పూ.

ఈ సినిమా రిలీజ్ డేట్‌ను జూన్‌ 20న ఉదయం 9 గంటలకు ప్రకటించనున్నాట్టుగా తెలిపాడు. రూపక్‌ రొనాల్డ్ దర్శకత్వంలో స్టీవెన్‌ శంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంపూర్ణేష్‌ బాబు మూడు విభిన్న పాత్రల్లో అలరించనున్నాడు. మరి ఈ సినిమా బర్నింగ్‌ స్టార్‌కు తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తుందేమో చూడాలి.


Advertisement
 
Advertisement
Advertisement