రాముడిలా మారే కృష్ణుడు | sampath raj directed by ramudu manchi baludu film | Sakshi
Sakshi News home page

రాముడిలా మారే కృష్ణుడు

Jul 17 2014 1:14 AM | Updated on Sep 2 2017 10:23 AM

రాముడిలా మారే కృష్ణుడు

రాముడిలా మారే కృష్ణుడు

కృష్ణుడిలాంటి కుర్రాడు రాముడిలా మారడానికి కారణం ఏంటి?

కృష్ణుడిలాంటి కుర్రాడు రాముడిలా మారడానికి కారణం ఏంటి? మారిన తర్వాత అతను రాముడిలానే ఉన్నాడా? మళ్లీ మారాడా? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘రాముడు మంచి బాలుడు’. ‘హ్యపీడేస్’ ఫేం రణధీర్, గౌతమి చౌదరి జంటగా టి. సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంపత్ రాజ్ దర్శకుడు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ఆశయంతో ఈ సినిమా చేస్తున్నాం.

ఇందులో షకీలా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. త్వరలో పాటలను, వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. కథాబలం ఉన్న చిత్రం ఇదని, అన్ని వర్గాలవారూ చూసే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. టైటిల్ రోల్‌ను రణధీర్ అద్భుతంగా చేస్తున్నారని కూడా చెప్పారు. ఇందులో తనది రెండు కోణాలున్న పాత్ర అని, ‘హ్యాపీడేస్’, ‘బ్రేకప్’ తర్వాత చేస్తున్న మరో మంచి సినిమా ఇదని రణధీర్ చెప్పారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాషశ్రీ, కెమెరా: సంతోష్ శానినేని, సంగీతం: నవనీత్ చారి.

Advertisement
 
Advertisement
Advertisement