వామ్మో... ఇంతక్లిష్టమైన పాత్ర చేయలేదు : సమంత | Samantha's role in 10 Enradhukulla revealed ! | Sakshi
Sakshi News home page

వామ్మో... ఇంతక్లిష్టమైన పాత్ర చేయలేదు : సమంత

Published Sat, Apr 4 2015 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

వామ్మో... ఇంతక్లిష్టమైన పాత్ర చేయలేదు : సమంత

 ఒకే సినిమాలో రెండు పాత్రలు చేసే అవకాశం వస్తే.. పైగా ఆ రెండు పాత్రలూ ఒకదానికి ఒకటి పోలిక లేకుండా పూర్తి భిన్నంగా ఉంటే.. ఆ ఆర్టిస్ట్‌కి సవాల్ లాంటిదే. ప్రస్తుతం సమంత ఈ సవాల్‌ను జయించే పని మీద ఉన్నారు. ‘10 ఎణ్రదుక్కుళ్ళ’ (అంటే.. పది లెక్కపెట్టే లోపు అని అర్థం) అనే తమిళ చిత్రంలో ఆమె రెండు పాత్రలు చేస్తున్నారు.

ఒకటి ఆధునిక యువతి, ఇంకోటి గ్రామీణ నేపాలీ యువతి పాత్ర. వీటిలో ఆధునిక యువతి పాత్రను సమంత సునాయాసంగా చేసేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటొచ్చీ గ్రామీణ నేపాలీ యువతి పాత్రే ఆమెను కష్టాల పాలు చేస్తోంది. ‘ఇప్పటివరకూ నా కెరీర్‌లో ఇలాంటి క్లిష్టమైన పాత్ర చేయలేదు’ అని స్వయంగా సమంతే పేర్కొన్నారు.
 
 అసలు సిసలైన నేపాలీ భామలా కనిపించడం కోసం ఆమె కేశాలంకరణ కూడా మార్చుకున్నారు. శారీరక భాషను కూడా మార్చుకుని, ఈ పాత్ర చేస్తున్నారామె. అభినయపరంగా కూడా సవాల్ అనిపించే పాత్ర. రొటీన్‌కి భిన్నంగా ఉండే పాత్రల కోసం ఆరాటపడుతున్న తనకు ఈ పాత్ర పూర్తి సంతృప్తినిస్తోందని సమంత పేర్కొన్నారు. విక్రమ్ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement