నా అందమంతా కరిగిపోతుందా? | samantha worries about working out in gym | Sakshi
Sakshi News home page

నా అందమంతా కరిగిపోతుందా?

Nov 20 2014 3:02 PM | Updated on Jul 14 2019 4:54 PM

నా అందమంతా కరిగిపోతుందా? - Sakshi

నా అందమంతా కరిగిపోతుందా?

సమంతకు ఈ మధ్య పెద్ద బెంగ పట్టుకుంది. జిమ్లో కసరత్తులు చేస్తే తన అందం ఏమైపోతుందోనని ఆమె భయపడుతోంది.

సమంతకు ఈ మధ్య పెద్ద బెంగ పట్టుకుంది. జిమ్లో కసరత్తులు చేస్తే తన అందం ఏమైపోతుందోనని ఆమె భయపడుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో చేసే అవకాశం వచ్చిన సమంతను.. కొన్నాళ్లు రోజు జిమ్కు వెళ్లమని చెప్పారట. దాంతో అంతకుముందు ఇలాగే కసరత్తులు చేసి రూపాన్ని పూర్తిగా మార్చేసుకున్న ప్రియాంకా చోప్రా లాంటివాళ్లు ఆమె కళ్లముందు కదలాడారు. తాను కూడా వాళ్లలాగే చేయాల్సి వస్తే తన గతేంటని ఈ అమ్మడు తెగ భయపడిపోతోంది.

అందుకే జిమ్కు వెళ్లినా కూడా అక్కడ వర్కవుట్లు చేయకుండా.. ఇదుగో ఇలా ఒక మూల కూర్చుండిపోయింది. టీషర్టు, త్రీఫోర్త్ వేసుకుని.. కాళ్లకు స్పోర్ట్స్ షూ తగిలించి, చేతులకు వర్కవుట్ గ్లోవ్స్ కూడా వేసుకున్నా కూడా.. ఏమీ చేయకుండా ఉండిపోయింది. అంతేనా, అలా కూర్చున్న ఫొటోతో ట్వీట్ కూడా పెట్టేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement